జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న, ఏ పథకం అమలు చేసిన దానిపై విమర్సలు చేయడం ప్రతిపక్ష టీడీపీ నేతలకు అలవాటైన పని. జగన్ అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి, టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా వల్ల రాష్ట్ర పరిస్థితి బాగోకపోయిన జగన్, ప్రజలకు ఉపయోగపడేలా పథకాలు అందిస్తున్నారు. తాజాగా మహిళలకు సున్నా వడ్డీ పథకం అందించారు. అలాగే 4 వేల కోట్లతో జగనన్న విద్యా దీవెన పేరిట ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇచ్చారు.

 

ఇక దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్సలు చేస్తున్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి, సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చి మహిళల్ని మోసం చేస్తున్నారని, అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసి జగనన్న విద్యా దీవెనకు కేటాయించారని అంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

అమ్మ ఒడి కోసం అంటూ 3500 కోట్ల బీసీ నిధులు కొట్టేసారని, ఇప్పుడు విద్యా దీవెన అంటూ మరో 202 కోట్లు బీసీ నిధులు కటింగ్ పెట్టారని ఆరోపించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం రూ.45 వేలు ఇస్తే, దాన్ని జగన్ రెడ్డి రూ.35 వేలకు తగ్గించి విద్యార్థులకు తీరని అన్యాయం చేసారని మండిపడ్డారు. ఇంకా చంద్రబాబు ప్రభుత్వంలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు  రూ.16 వేలు కోట్లు ఇచ్చారని, అలాగే కాంగ్రెస్ హయాంలో ఉన్న రూ.2400 కోట్ల బకాయిలని కూడా చెల్లించారని అంటున్నారు.

 

అయితే అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు సర్దుకోవాల్సిన అవసరముందని, అయినా చంద్రబాబు ఎన్నికల ముందు పలు కార్పొరేషన్ల  డబ్బులు తీసి, పసుపు-కుంకుమ అంటూ విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని, ఇంకా చాలానే కార్యక్రమాలు చేసారంటూ గుర్తు చేస్తున్నారు. బీసీల డబ్బులు కొట్టేసింది బాబే అంటూ మండిపడుతున్నారు. అలాగే చంద్రబాబు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అన్ని వేలకోట్లు ఇస్తే ఇప్పుడు జగన్, పాత బకాయిలని ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: