ఇప్పుడు అంద‌రి చూపు లాక్ డౌన్ కొన‌సాగింపుపైనే. మే 3 తరువాత లాక్ డౌన్ ఎత్తివేత ఉంటుందా, సడలింపులతోనే సరిపెట్టేస్తారా అన్న ఆసక్తి కూడా సర్వత్రా నెలకొని ఉంది. లాక్ డౌన్ విష‌యంలో నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌ధానంగా మూడు విష‌యాలు అడ్డంకిగా మారుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలోనికి రాలేదని రోజు రోజుకూ పెరుగుతున్నకేసులే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేతపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తి వేత విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. 

 


ఒకదాని వెంట ఒక రంగానికి వెసులు బాట్లు ఇస్తూ…లాక్ డౌన్ ను కొనసాగించడమే ఉత్తమంగా కేంద్రం భావిస్తున్నట్లు అది ఇస్తున్న సంకేతాలను బట్టి తేలుతోంది.  దేశంలో రెడ్, ఆరెంజ్, జోన్లుగా గుర్తించిన ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగిస్తూనే గ్రీన్ జోన్లలో నిబంధనలతో ఎత్తివేసే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే పట్టణాలు, నగరాల కంటే గ్రామీణ ప్రాంతాలలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది. అ ప్రాంతాలలో ప్రజల జీవనోపాధి వ్యవసాయం కావడంతో ముందుగా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

 

కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ముగిసే సమయం సమీపిస్తున్న కొద్దీ కేంద్రం లాక్ డౌన్ ఉపసంహరణ ఎలా, ఎప్పుడు, ఎక్కడ నుంచి ప్రారంభించాలి అన్న అంశాలపై మల్లగుల్లాలు పడుతోంది. మే 3 తరువాత లాక్ డౌన్ ఎత్తివేత ఉంటుందా, సడలింపులతోనే సరిపెట్టేస్తారా అన్న ఆసక్తి కూడా సర్వత్రా నెలకొని ఉంది. లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో సమగ్ర వ్యూహంతో వ్యవహరించకుంటే…కరోనా కట్టడి విషయంలో ఇంత వరకూ పడిన శ్రమ, చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోతుందన్న భయాలను వైద్యులు, మేధావులే కాకుండా సామాన్య జనం కూడా వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: