సంక్షోభం వచ్చినప్పుడు బెంబేలెత్త కూడదు.. దాన్ని ఎదుర్కోవాలి. అంతే కాదు.. ప్రతి సంక్షోభం లోనూ ఓ అవకాశం కూడా ఉంటుంది.. దాన్ని ఉపయోగించుకోవాలి.. ఈ సక్సస్ ఫార్ములాను తెలంగాణ సర్కారు కూడా బాగానే ఒంటబట్టించుకున్నట్టుంది. అందుకే.. కరోనా కాలంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేస్తోంది. సాధారణంగా హైదరాబాద్ వంటి బిజీ బిజీ నగరంలో రోడ్ల మరమ్మత్తులు చేయాలంటే ట్రాఫిక్ ఇబ్బందుల్తో నగరవాసులకు నరకం కనిపిస్తుంటుంది.

 

IHG's IKEA junction beautified with greenery, sculptures

అందుకే ఈ కరోనా సమయంలో ఖాళీగా ఉన్న రోడ్ల మరమ్మత్తులు కానిచ్చేస్తున్నారు. అలాగే.. నగర సుందరీకరణపైనా దృష్టి సారించారు. ప్రత్యేకించి ఐటీ కారిడార్‌ ను మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. ఐటీ కారిడార్ లోని కీలకమైన ఐకియా జంక్షన్ ను తెలంగాణ సర్కారు బహు సుందరంగా తీర్చిదిద్దాలని భావించింది. జంట నగరాల్లో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఐకియా జంక్షన్ ని ముస్తాబు చేస్తోంది.

 

IHG

 

ఇందు కోసం హెచ్ ఎండీఏ ఇంజనీరింగ్ , అర్బన్ ఫారెస్ట్రీ యంత్రాంగం ముమ్మరంగా పనులు చేస్తున్నాయి. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో ఐకియా జంక్షన్ ను తీర్చి దిద్దుతున్నారు. ఐకియా జంక్షన్ లో గ్రీనరీ బ్యూటిఫికేషన్ తో పాటు లోహాలతో రూపొందించిన బేర్ ఫ్యామిలీ.. అంటే ఎలుగుబంటి కుటుంబం బొమ్మలు పెడుతున్నారు. వాటితో పాటు ఓ భారీ పిల్లి బొమ్మ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

 

IHG

 

అదే జంక్షన్‌లో మరికొన్ని ఓలివ్ చెట్లను పెడుతున్నారు. పది వరకూ రాతి బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. లాక్ డౌన్ కాలపరిమితి ముగిసే నాటికి ఐకియా జంక్షన్ ను చూసి నగరవాసులు అదిరిపోవాలన్నది సర్కారు ప్లాన్. ఇప్పటికే ఐటీ కారిడార్ మరో కొత్త హైదరాబాద్ లా అనిపిస్తుంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న ఫీలింగ్ తెస్తుంది. ఇక ఇప్పుడు ఈ కొత్త అందాలు మరింతగా అదరగొట్టబోతున్నాయన్నమాట.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: