ఈ మధ్య కాలంలో పిల్లలు బాగా మారిపోయారబ్బా.. ఒకప్పుడు ఆడుకోవడానికి ఏదైనా ఉంటే బాగుండు అనుకునేవారు... కానీ ఈ రోజుల్లో మాత్రం అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో కూడా స్మార్ట్ఫోన్ కావాలని మారాం చేస్తున్నారు . అంతేకాదు కొంతమంది ఏకంగా పెద్ద పెద్ద కోరికలే కోరుతున్నారు. ఇక్కడ ఓ బుడతడు అలాంటిదే చేశాడు. ఇక్కడ ఉన్న బుడ్డోడు ఐదేళ్ల చిన్నారి. ఐదేళ్ల వయస్సు అంటే ఏం అడుగుతారు మా అంటే సైకిల్ లేదా ఆడుకోవడానికి ఏదైనా వస్తువు అడుగుతారు. కానీ ఈ ఐదేళ్ల చిన్నారి ఏం అడిగాడో తెలుసా ఏకంగా ఓ లగ్జరీ కారును కొనివ్వాలి అంటూ అమ్మ దగ్గర మారాం చేశాడు. దీంతో లగ్జరీ కార్ కొనేందుకు అమ్మ ఒప్పుకోకపోవడంతో ఏం చేసాడో తెలిస్తే షాక్ అవ్వక  తప్పదు. 

 

 

 ఇంతకీ ఆ బుడ్డోడు కార్ కొని ఇవ్వకపోతే ఏం చేశాడో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే మరి .... అమ్మ లగ్జరీ కారు కొనివ్వలేదని ఇంట్లో ఉన్న మరో కారు వేసుకుని ఐదేళ్ల చిన్నారి పారిపోయిన ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చోటుచేసుకుంది.ఈ ఘటన  ఏకంగా పోలీస్ లను సైతం అవాక్కయ్యేలా చేసింది. లాస్ ఏంజిల్స్లోని హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు... డ్రైవర్ లేకుండా వెళుతున్న కారు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ఆ కారును వెంబడించి ఆ తర్వాత కొద్ది దూరంలో ఆపారు. ఆపై ఆ కారులో ఉన్న డ్రైవర్ ని చూసి అవాక్కయ్యారు  పోలీసులు. ఆ కారులో ఉన్న డ్రైవర్ ఐదేళ్ల చిన్నారి. ఎందుకు ఇలా వచ్చావ్ అని పోలీసులు ప్రశ్నిస్తే తన తల్లి తనకు లగ్జరీ కారు కొనివ్వలేదని దీంతో వేరే కారు  తీసుకొని ఇలా వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు. స్వయంగా తానే కాలిఫోర్నియాకు వెళ్లి తాను  కొనాలి అని నిర్ణయించుకున్న కారును కొనేందుకు వెళ్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 మరి కారు కొనేందుకు ఎంత డబ్బు తీసుకొచ్చావు అని పోలీసులు ప్రశ్నిస్తే మూడు డాలర్లు  అంటూ చూపించాడు. ఇక ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా తమ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఇంట్లోని స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ తో ఐదేళ్ల బాలుడు బయటకు వచ్చాడు అంటూ పోలీసులు తెలిపారు. ఆ కారును ఆపిన తర్వాత వెనుక వైపు నుంచి చూస్తే డ్రైవర్ కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యానని... కానీ ముందుకు వచ్చి చూసి అవాక్కయ్యాను అంటూ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇక తన ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఆ బాలుని వెంబడించి కారు ఆపినట్లు  తెలిపిన పోలీస్ అధికారి మరోసారి ఇలాంటి పనులు చేయవద్దు తల్లిదండ్రులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: