రాజకీయాల్లో ఎవరైనా సరే తమ వారసులని మంచి పొజిషన్‌లో చూడాలనుకుంటారు.  ఇక దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏమి అతీతంగా లేరు. తన తనయుడు నారా లోకేష్‌ని పైకి తీసుకురావాలని తెగ కష్టపడుతున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా సరే, లోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి పాలన పగ్గాలు ఇచ్చారు.

 

అయితే ఎలాంటి అనుభవం లేకపోయినా లోకేష్ తనకు సాధ్యమైన మేర పనిచేశారు. కానీ అలా మంత్రిగా పనిచేసిన ప్రజల అభిమానం అయితే పెద్దగా పొందలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక పార్టీలో మరింతగా పట్టు తెచ్చుకోవడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కూడా తన తర్వాత తనయుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు.

 

ఇక ఈ విధంగా చేసే క్రమంలోనే చంద్రబాబు యువనేతలని పెద్దగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడం లేదు. అదే ఓల్డ్ సీనియర్ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్ యువతదే అని తెలిసి కూడా బాబు ఆ వైపు వెళ్ళడం లేదు. ఒకవేళ లోకేష్ పార్టీ పగ్గాలు తీసుకుంటే యువ నాయకులే ఆయన వెనుక నడవాలి. అందుకు ఇప్పటినుంచే యువనేతలకు మంచి ప్రాధాన్యం కల్పించాలి. కానీ ప్రస్తుతానికైతే అది జరుగుతున్నట్లు కనిపించడం లేదు.

 

అయితే ఈ విషయంలో బాబుకు భయం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడ యువనాయకులని ఎంకరేజ్ చేస్తే లోకేష్‌ని డామినేట్ చేసేస్తారేమో అని ఆలోచన చేస్తున్నట్లు కనబడుతోంది. దీనికి దేవినేని అవినాష్ వ్యవహారమే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తెలుగు యువత అధ్యక్షుడుగా అవినాష్ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు ఎక్కువ క్రేజ్ వస్తుందని చెప్పి, సైలెంట్ చేయించారు. ఆ దెబ్బకే అవినాష్ కూడా పార్టీ మారిపోయారు. ఇలాగే భవిష్యత్‌లో కూడా యంగ్ లీడర్స్ లోకేష్‌ని డామినేట్ చేస్తారనే భయంతో బాబు ఇంకా ఓల్డ్ పాలిటిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: