ఆ మద్య కేరళాలో ఓ గర్భంతో ఉన్న ఎనుగు మానవ తప్పిదాల వల్ల బాంబ్ తినడం దాని నోరు గాయం కావడంతో పద్నాలు రోజుల పాటు నరక యాతన అనుభవించి నీటిలో ఉంటూ చనిపోయింది.  సాధారణంగా మనుషుల వల్ల ఏనుగులకు ఎప్పటి నుంచో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వాటి దంతాల కోసం అంత పెద్ద ఏనుగులను వధించడం జరుగుతుంది.  చాలా మంది స్మగ్లర్లు  దంతాల కోసం ఎన్నో ఏనుగులను బలి తీసుకున్న విషయం తెలిసిందే.  దేశంలో గత కొంత కాలంగా  ఏనుగుల మరణ మృదంగం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రెండు ఏనుగులు మృతిచెందాయి.

IHG

ఓ వైపు కేరళ ఏనుగు ఉదంతం దేశం మర్చిపోకముందే వరుసగా ఏనుగులు మరణించడం షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక్కడ మూడు ఆడ ఏనుగులు మృతిచెందాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఓ గర్భిణీ ఏనుగు కూడా ఉండడం బాధాకరం. వారం వ్యవధిలోనే ఈ ఏనుగులు మృతిచెందాయి. ధంతారి జిల్లాలోని మోగ్రి గ్రామంలోని బ్యాక్‌వాటర్‌ సమీపంలోని చిత్తడి నేలలో మృతిచెంది పడి ఉన్న ఏనుగు పిల్లను ఈరోజు గుర్తించారు.‌ అయితే మృతిచెందిన ఏనుగు పిల్ల వయస్సు మూడున్నరేళ్ళు.

IHG

నీళ్లు త్రాగేందుకు బ్యాక్‌ వాటర్‌ ప్రదేశానికి వెళ్లి అక్కడి బురద నేలలో చిక్కుకుని చనిపోయి ఉండొచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం గురించి ధంతారి డివిజన్‌ అటవీ అధికారి అమితాబ్‌ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. నీళ్లు త్రాగేందుకు బ్యాక్‌ వాటర్‌ ప్రదేశానికి  వెళ్లి అక్కడ ఏనుగు చనిపోయి ఉండొవచ్చని ఆయన అన్నారు. మరొక ఘటనలో రాయగఢ్‌ జిల్లా ధరంజైగఢ్‌లో మరో ఏనుగు మృతిచెందింది. జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి ఏనుగు మృతిచెందింది. ఏనుగు మృతి ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: