హైదరాబాద్ లో మళ్లీ లాక్‌ డౌన్ పెట్టడం ఖాయమని తేలిపోయింది. ఈ మేరకు ప్రభుత్వమే చెబుతోంది. అయితే అది ఎప్పటి నుంచి ఉంటుంది.. ఎలా ఉంటుందన్నది ఇంకా తేలలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ లో ఈ లాక్‌డౌన్‌ మరింత కఠినంగా ఉండబోతోందని తెలుస్తోంది.

 

 

గతంలో లాక్ డౌన్ సమయంలోనూ నిత్యావసరాల కోసం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ షాపులు ఓపెన్ గానే ఉండేవి. కానీ ఈసారి మాత్రం చాలా కఠినంగా లాక్ డౌన్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి కేవలం 2 గంటలు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ లాక్ డౌన్ దాదాపు 15 రోజులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

 

 

ఈ లాక్ డౌన్‌లో హైదరాబాద్ తో జిల్లాలకు కనెక్టివిటీ పూర్తిగా లేకుండా చేసే అవకాశం ఉంది. అంటే.. రాకపోకలు అన్నీ బంద్ అవుతాయన్నమాట. వ్యక్తిగతంగా కార్లలోనూ ప్రజలను అనుమతించే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే రైళ్లు, విమానాల రాకపోకలు కూడా బంద్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది.

 

 

ఇలాంటి పలు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. మంత్రి వర్గంలో ఈ ప్రతిపాదనలన్నీ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మళ్లీ హైదరాబాద్ లో లాక్ డౌన్ అంటూ వస్తే.. అది చాలా కఠినంగా ఉండబోతుందన్నది విశ్వసనీయ సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: