హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం మొత్తం వరదల్లో  మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వరద ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇక సాధారణంగానే చిన్న వర్షం పడితే చిగురుటాకులా వణికిపోతూ  ఉంటుంది భాగ్యనగర్. ఇక మొన్న కురిసిన భారీ వర్షానికి రహదారులు మొత్తం జలమయం కావడమే కాదు పూర్తిగా పెద్ద పెద్ద చెరువులను తలపించాయి. అన్ని ప్రాంతాల్లో  వాహనాలు ఎంతో మంది మనుషులు నీటిలో కొట్టుకుపోయారు కూడా. ఇక మొన్న కురిసిన భారీ వర్షం నుంచి హైదరాబాద్ నగరం ఇంకా తేరుకోలేదు.




 ఇక నాళాలు  మొత్తం పూర్తిగా పొంగిపొర్లడంతో  భవనాల్లో కి నీరు చేరి దుర్వాసన లోనే దుర్భర బతుకును  వెళ్లదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో నగర వాసులు అందరూ భారీ వరదల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ కిట్ పేరిట నెల సరి పడా ఇంటి సరుకులను దుప్పట్లను కూడా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా వరద బాధితుల అందరికీ సహాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విషయం తెలుస్తోంది.



 ఇక వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న వరద సహాయం నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. వరద ప్రభావం కి గురైన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు లక్ష రూపాయలు అందించనుంది. వరదల కారణంగా పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. నేటి నుంచి సాయం పంపిణీ కార్యక్రమము మొదలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరదల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న ఎంతోమందికి ప్రభుత్వం అందించే సహాయం చేయూత నిచ్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: