ఏపీ పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుభవార్త చెప్పారు. పోలీసులకు అందించే బీమాను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల సహజ‌ మరణానికి ఇచ్చే బీమా మొత్తం రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్బీఐతో పొలీసుల కోసం జీవన్ జ్యోతీ బీమా, సురక్ష బీమా ఎంవోయూపై డీజీపీ సవాంగ్ సంతకం చేశారు. ప్రతీ పోలీసు స్టేషన్‌లో బుధవారం నుంచి పాలసీలు ఇవ్వనున్నారు. మంగళవారం లాంఛనంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుళ్ళు డి.రజని, దుర్గా ప్రసాద్‌కి పాలసీలను అందించారు. రేపటి నుంచి 10 రోజుల పాటూ పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాలు జరపనున్నారు.

అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీలో అమలు జరుగుతోంది అన్నారు డీజీపీ సవాంగ్. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలిస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని.. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులో ఉంచామన్నారు. రికార్డు స్ధాయిలో దేవాలయాల సంబందించిన 306 కేసులను ఏపీ పోలీసు శాఖ చేధించిందని.. రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు ,ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్‌తో మ్యాపింగ్ చేశామన్నారు. అలాగే కేసులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. పోలీసుల కోసం ప్రత్యేక పాలసీలు ఇస్తున్నామని.. రూ.40లక్షల వరకూ యాక్సిడెంటల్ పాలసీ, రూ.3లక్షల వరకూ సహజ మరణం పాలసీలు ఉన్నాయని.. పోలీసుల అద్భుతమైన సేవలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు ఎస్బీఐ ఏజీఎం. ఏడాదికి రూ.12 కడితే రెండు లక్షల బీమా.. సుకన్య సమృద్ధి యోజన కూడా అందరూ వినియోగించుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: