ఏపీలో దాదాపుగా ఇప్పుడు ఆదాయ మార్గాలు అనేవి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆదాయ మార్గాలను తిరిగి పెంచడానికి సీఎం జగన్ చాలా వరకు కూడా కష్ట పడుతున్నారు. అయితే ఈ ఆదాయ మార్గాల విషయంలో ఆయనకు అనుకున్న విధంగా పరిస్థితులు కలిసి రావటం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించకుండా కేవలం అప్పులు ఇచ్చే విధంగానే వ్యవహరిస్తోంది. దీంతో సీఎం జగన్ కాస్త రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కువగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పట్టున్న మాజీ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసే విధంగా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఒకరిని దీనికి చైర్మన్ గా చేసే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ సలహాదారుగా మాజీముఖ్యమంత్రి రోశయ్యను తీసుకునే విధంగా సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆయనతో కూడా ఇప్పటికే ఏపీ ఆర్థిక శాఖ అధికారులతో పాటు కొంతమంది మాట్లాడినట్లు సమాచారం.

ఆర్థిక శాఖ మీద పట్టు ఉన్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించి ముందుకు వెళ్లాలి అని సీఎం జగన్ భావిస్తున్నారట. ఇప్పటికే కొంత మంది మంత్రుల పనితీరు అసహనంగా ఉన్న జగన్... మంత్రుల శాఖల్లో వచ్చే ఆదాయానికి సంబంధించిన ఒక ప్రత్యేక నివేదికను తయారు చేయించి ఆ విధంగా వారికి పలు సూచనలు చేసి వారు గనక పనితీరు మెరుగుపరుచు కోకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా ఉంటే మాత్రం వారిని ఆయా శాఖల నుంచి తప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆర్థిక శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీ రూపు దాల్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: