చంద్రబాబు ఎంత ఓడిపోయినా ప్రజలకు ఎంత కోపమున్నా ఒక వర్గం ప్రజలకు ఎంతో కొంత చంద్రబాబు పై సింపతీ ఉందని చెప్పొచ్చు.. ఆ సింపతీ తోనే ఇప్పటివరకు జగన్ ను ఎంత విమర్శించినా ప్రజలు ఏమాత్రం తిరిగి అనకుండా ఉన్నారు.. అసలే దారుణమైన ఓటమి పాలు అయ్యాడు.. అందులోనూ ప్రతిపక్షంలో ఉంది ఈ మాత్రం మాటలు అననీయకుండా ఉంటే చంద్రబాబు లాంటి నాయకులూ ఢీలా పడటమే కాదు, అలాంటి నాయకులూ మళ్ళీ పుట్టేలా చేయకుండా చేసిన వారము అవుతాము అని ప్రజల్లో ఉంది.. అందుకే అమరావతి విషయంలో జగన్ ని అన్ని తిట్టి పోస్తున్నా చంద్రబాబు ని ప్రజలు ఎవరు అడ్డుకోలేదు.. అయితే ప్రజలు ఊరుకుంటున్నారని చెప్పి చంద్రబాబు ఇంకా ఎక్కువగా తిట్టి పోయడం కూడ అస్సలు బాగోట్లేదు..

జగన్ రావడం కాస్త ఆలస్యమైనా రావడం రావడమే కుంభస్థలం కొట్టారు..ఏపీలో దాదాపు అని నియోజక వర్గాల్లో వైసీపీ తన సత్త చాటింది.. చాటడమే కాదు మళ్ళీ ముందు ముందు ఓటమి అన్నదే ఎరుగకుండా గట్టి పునాదులు వేసుకుంది.. సరైన టైం లో సరైన లీడర్ లు జగన్ కు దొరకడం తో గతంలో దేశంలో ఏ పార్టీ ఎరుగంటువంటి ఘన విజయాన్ని జగన్ తన సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో తన ఎమ్మెల్యేలను బెదిరించి లాక్కునే చంద్రబాబు కు ప్రజలు చెప్పిన బుద్ధి అలా ఉంచితే జగన్ మాత్రం ఆయనకు మాస్టర్ స్టాక్ ఇచ్చారని చెప్పొచ్చు..  జగన్ ప్రభంజనం ఎలా వుంది అంటే టీడీపీ కి పెట్టని కొత్తగా మిగిన ప్రాంతాలని వైసీపీ కి దాసోహం అయ్యాయి.. టీడీపీ పునాదులు కదిల్చేలా జగన్ సాధించిన ఈ విజయం కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది..

ఇక చంద్రబాబు ను  గుక్కతిప్పుకోనీయని రీతిలో పాలన సాగిస్తున్న జగన్‌ను ఎదుర్కొవడానికి అనుభవాన్నంతా వాడుతున్నప్పటికీ పెద్దగా కన్పిస్తున్న ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. మరో పక్క తనకు అండగా ఉంటారనుకున్న నేతలంతా నిష్క్రియాపర్వానికి మారిపోయారు. కనీసం తాను ఆదేశించిన పనులను కూడా పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉండగా తనకు కళ్ళూ, చెవులూ తదితర ప్రధాన అవయవాల మాదిరిగానే వ్యవహరించిన వారు ఇప్పుడు తలోదారీ చూసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: