తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న సంగతి తెలిసిందే.  టిఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కోవడం అనేది ప్రధానంగా సవాల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా సీఎం కేసీఆర్ ఏది మాట్లాడినా సరే చెల్లుబాటవుతుంది. సీఎం కేసీఆర్ కి కూడా ప్రజల మద్దతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన అన్ని విధాలుగా కూడా ఇప్పుడు తెలంగాణలో దూసుకుపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు అనే భావన వ్యక్తమవుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నాయకత్వ లోపంతో పాటు ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలే అనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు దీనిని అధిగమించడానికి సీఎం కేసీఆర్ కాస్త ఎక్కువగానే  కష్టపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఎలాగూ లేదు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో దూకుడుగా వెళుతున్నారు. మరికొన్ని కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది ఏంటి అనేది మాత్రం స్పష్టత లేదు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో సీఎం కేసీఆర్ చాలావరకు దూకుడుగా వెళ్తున్న సరే క్షేత్రస్థాయిలో మాత్రం లబ్ధిదారులకు సరైన స్థాయిలో అందడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల వచ్చిన వరదల దెబ్బకి హైదరాబాదులో ఉండాలి అంటేనే చాలా మంది భయపడే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని నమ్మాలంటే కొంతమంది ఆలోచిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్తులో ఏ విధమైన పరిణామాలు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: