తెలుగుదేశం పార్టీలో యువ నాయకులు చాలామంది పదవుల కోసం ఎదురుచూస్తున్న సరే చంద్రబాబు నాయుడు మాత్రం యువనేతలకు తనకు పదవులు ఇచ్చే విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. కీలక నేతలకు కూడా పదవులు ఇవ్వకపోవడం తో ఇప్పుడు చాలామంది అసహనం గా ఉన్నారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కష్టాలు పడుతున్న సమయంలో కూడా ఈ విధంగా ప్రవర్తించడం తో చాలామంది నేతలు పార్టీలో ఉండడానికి కూడా ఇష్టపడటం లేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కీలక యువ నేతలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అయితే రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు మాత్రం ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే జేసీ కుటుంబం  తెలుగుదేశం పార్టీ లో చాలా అసహనంగా ఉంది. కుటుంబం నుంచి జేసీ పవన్ రెడ్డి ఇప్పుడు బిజెపిలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

ఆయన పార్టీ కోసం పని చేయాలని భావించిన సరే పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. అటు జెసి దివాకర్ రెడ్డి చెప్పిన సరే ఆయన మాత్రం ఇప్పుడు పార్టీ అధిష్టానం తీరుపై తీవ్రస్థాయిలో అసహనంగా ఉన్నారు. ఆయనతో పాటుగా కర్నూలు జిల్లాలకు చెందిన భూమా అఖిలప్రియ కూడా ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథరెడ్డి కూడా ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయి. మరి ఎవరు పార్టీ నుంచి బయటకు వస్తారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: