తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా హాట్ టాపిక్ గా మారారు. ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన వెళ్తారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు ప్రస్తుతం వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే రేవంత్ రెడ్డికి తెలంగాణ లో కాస్త అనుకూలంగానే పరిస్థితులు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే బిజెపి నుంచి మంచి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఆయనకు అక్కడ మంచి గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన బీజేపీ లోకి వెళ్లి పోతే మంచిది అనే భావన కూడా కొంతమంది నేతలు నేరుగానే వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడే బీజేపీ లోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వడం లేదు. అయితే దీపావళి తర్వాత ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు.

దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఇప్పటికే ఆయన మార్గం కూడా సుగమం చేసుకున్నారు అని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బిజెపికి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: