హైదరాబాద్ మహానగరం మళ్లీ అభివృద్ది పనుల్లో జోరును పెంచింది.. నిన్న మొన్నటి వరకు వరదల కారణంగా వెనకడుగు వేసిన సర్కార్ ఇప్పుడు వేగాన్ని పెంచింది.రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవాన్ని అందించేందుకు తర్జన భర్జన పడుతుంది. సమయం లేదు మిత్రమా అభివృద్దా లేక అవమానాల అన్నట్లు వ్యవహరిస్తుంది. దీంతో అన్నీ కార్యక్రమాలను చక చక చేయడంలో దూకుడును ప్రదర్శిస్తుంది.  



అసలు విషయానికొస్తే.. హైదరాబాద్-పుణె-ముంబయి బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 711 కిలోమీటర్ల పనులకు కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో టెండర్లకు పిలవనుంది..వచ్చే ఏడాదికి ఈ పనులను ప్రారంభించేలా చర్యలను ముమ్మరం చేస్తుంది.బుల్లెట్ ట్రైన్‌తో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా వాణిజ్య పరంగానూ ఎంతో సౌలభ్యంగా ఈ కారిడార్ ఉండనుంది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌లపై 80 నుంచి గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లు ప్రయాణించగలవు. అంతకన్నా వేగంగా వెళ్తే ఈ ట్రాక్‌లు తట్టుకోలేవు. అయితే ఈ ట్రైన్ వేగాన్ని తట్టుకునేలా ఉండాలంటే ఆయా మార్గాలలో కొత్త ట్రాక్ లు వేయాల్సి వస్తుందని తెలుస్తోంది. 



దేశం మొత్తం 7 మార్గాల్లో బుల్లెట్ రైలు కారిడార్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో ముంబయి-హైదరాబాద్ మార్గం ఒకటి. ఈ రూట్‌తో పాటు మరికొన్ని రూట్ల నిర్మాణం కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు మొదలు పెట్టింది.ఈ ట్రైన్ ఎంట్రీ పై నవంబర్ 5 న జరగనున్న సమావేశంలో చర్చలు జరిపి కీలక నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో సర్కార్ ఉన్నారు. వచ్చే నెల 11 న టెండర్లకు పిలువగా, 18 వా తేదీన టెండర్లను పరిశీలిస్తున్నారు. ఇక వచ్చే ఏడాదిలో పనులను ప్రారంభించి వచ్చే మూడు ,నాలుగేళ్లలో ఈ ట్రైన్ ను తిప్పాలని ఆలోచనలో సర్కారు ఉన్నారు.. ఇప్పుడు దేశంలో అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు కారిడార్ పనులు నడుస్తున్నాయి... త్వరలోనే ట్రైన్ తిరగనుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: