కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వదలలేదు. కానీ భయం మాత్రం మనిషిని వదిలింది. అదే తేడా. కరోనా వ్యాప్తి చెందిన మొదట్ల అంతా వణికిపోయేవారు. ప్రతీ వారిని అనుమానంగా చూసేవారు. ఢిల్లీలో ఒక బహిరంగ ప్రదేశంలో ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకోకుండా తుమ్మాడని అంతా భయంతో అతన్ని చితక్కొట్టేశారు. అంటే భయానికి అది పీక్ స్టేజ్ అన్నమాట. కానీ కొద్ది నెలల్లోనే మార్పు వచ్చేసింది. దానికి తోడు కొంతమంది పాలకులు కూడా కరోనా వస్తే ఏం కాదు, జలుబు, జ్వరం మాదిరిగానే ఇలా వచ్చి ఆలా వెళ్ళిపోతుందని చెప్పుకొచ్చారు. అవి జనం పానిక్ కాకుండా ఊరడింపుగా చెప్పిన మాటలే తప్ప నిజానికి కరోనా అంత తేలికపాటి జబ్బు మాత్రం కాదు.

దానికి అనేక సాక్ష్యాలు ఉదాహరణలు ఉన్నాయి. కరోనా వచ్చి శరీరంలో ముఖ్యమైన అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ తరువాత ఆరోగ్యవంతులు కోలుకున్నా కూడా అనేక ఇతర సమస్యలు ఆ తరువాత కూడా వెంటాడుతున్నాయని అంటున్నారు. ఇక ఇతర జబ్బులతో అప్పటికే ఉన్న వారు అయితే మరణిస్తున్నారు. ఇలా భారత్ లాంటి కరోనా సోకిన వారు ఇప్పటికి 80 లక్షలకు పైగా ఉన్నారని అంటున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా తగ్గినట్లుగా ఉంటూనే మళ్ళీ రోజుకు అర లక్షకు చేరుకోవడం ఒక ఉదాహరణ  మాత్రమే.

ఇక ఢిల్లీలో అయితే రోజుకు అయిదారు వేల కేసులు నమోదు అవుతున్నారు. ఇక్కడ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని అంటున్నారు. యూరోపియన్ దేశాల్లో అపుడే కరొనా సెకండ్ వేవ్ మొదలైందని వార్తలు వస్తున్నాయి. సెకండ్ వేవ్ కనుక వస్తే బీభత్సంగా  ఉంటుందిట. గతంలో బ్రిటన్ లో ప్రతి పదివేల మందికి గానూ 60 మందికి కరోనా వస్తే ఇపుడు సెకండ్ వేవ్ లో ఆ సంఖ్య 128కి పెరిగిందిట. దీన్ని బట్టి చూసే కరోనా రెండవ మారు చాలా తీవ్రంగానే వ్యాపిస్తుంది అని అర్ధమవుతోంది శీతాకాలం భారత్ లాంటి దేశాల్లో ఎంటరైంది. నాలుగు నెలల పాటు అది ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి కనుక చేయకపోతే మాత్రం కరోనా సెకండ్ వేవ్ ధాటీగానే ఉంటుందని అంతా హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: