గర్వానా పండు చూడటానికి ఒంటి కన్ను రాక్షసుడిలా కనిపిస్తుంది. ఇలాంటి పండ్లు కూడా ఉన్నాయంటే నమ్మలేం. కానీ ఇవి దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో పాకుతూ వెళ్లే గ్వారానా మొక్కలకు కాస్తాయి. అధిక బరువు తగ్గిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. అవేంటో చూద్దామా.

అయితే తలనొప్పి, ఫీవర్, కాలిన గాయాల్ని నయం చేయడంతోపాటూ... లైంగిక పటుత్వాన్ని పెంచే అద్భుత ఔషధ గుణాలు ఈ పండ్లలో ఉన్నాయి. కాస్త పుల్లగా, ఉప్పగా ఉండే ఈ పండ్ల నుంచీ గ్వారానా పౌడర్ తయారు చేస్తారు. ఈ పౌడర్‌ను నీటిలో కలిపి తాగితే... ఎక్కువ కాలం జీవిస్తామని అమెజాన్ ప్రజలు నమ్ముతారు. ఇది సంజీవని లాంటిదని నమ్ముతారు. కాఫీ గింజల్లో ఉండే కెఫైన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కెఫైన్... గ్వారానా బెర్రీస్‌లో ఉంటుంది.

గ్వారానా పండ్ల ఉత్పత్తిలో... 70 శాతాన్ని సాఫ్ట్, ఎనర్జీ డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. మిగతా 30 శాతం ఉత్పత్తిని నీటిలో పౌడర్‌లా కలుపుకొని తాగేందుకు, కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉత్పత్తుల కోసం వాడుతున్నారు. ఈకోలీ, సాల్మొనెల్లా, మ్యూటాన్స్ వంటి ప్రాణాంతకమైన బ్యాక్టీరియాను చంపేయడంలో ఈ పండ్లలోని పొటాషియం కీలక పాత్ర పోషిస్తోంది. మన ఎముకలు బలంగా ఉండేందుకు, పటిష్టంగా అయ్యేందుకు ఈ పండలోని పోషకాలు మేలు చేస్తాయి.

సంతాన సాఫల్యత కలిగించేందుకూ, స్పెర్మ్ కౌంట్ పెంచేందుకూ ఈ పండ్లతో ప్రత్యేక టాబ్లెట్లను తయారుచేస్తున్నారు. వాటికి ప్రపంచ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. బరువు తగ్గాలంటే ఈ పండ్లతో తయారుచేసిన వెయిట్ లాస్ ట్యాబ్లెట్లు వాడొచ్చు. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను ఈ పండ్ల పౌడర్ తరిమికొడుతుంది. జీర్ణ ప్రక్రియ సరిగా జరగనివారు ఈ పండ్లతో తయారు చేసిన పిల్స్ వాడుతుంటారు. మెమరీ లాస్ ఉండేవారు, మతిమరపుతో ఇబ్బంది పడేవారికి దివ్య ఫలంలా పనిచేస్తోంది గ్వారానా. దీనితో తయారుచేసిన మందులను వాడే వారికి జ్ఞాపక శక్తి పెరుగుతోందని పరిశోధనల్లో తేలింది.

భయంకరమైన వ్యాధి కాన్సర్ అంతు చూసే అద్భుత గుణాలు కూడా గ్వారానాలో ఉన్నాయని తేలింది. ఈ పండ్లలోని కాటెచిన్, ఎపికాటెచిన్, ఎంట్-ఎపికాటెచిన్, ప్రొసియానిడిన్స్, బీ1, బీ2, బీ3, బీ4, ఏ2, సీ1 వంటి పోషకాలు... కాన్సర్ వ్యాధిని తరిమికొడుతున్నాయి. అందుకే ఈ పండ్లకు మెడిసిన్‌లో వీపరీతమైన డిమాండ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: