నివర్ తుఫాను ప్రభావం ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ను బెంబేలెత్తిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే కొన్ని రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత అధ్వానం గా మారిపోతుంది. నివర్ తుఫాన్  కారణంగా తీవ్ర స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రస్తుతం ఎంతో నష్టం వాటిల్లుతుంది. నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన నివర్ తుఫాను తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వనికించింది అనే విషయం తెలిసిందే.  తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవటంతో  ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు.



 ఇక భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా రావడంతో ప్రజలందరూ ఏ క్షణం లో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని  బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలోనే భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లక్షల ఎకరాల్లో పంట నష్టపోవడంతో రైతులందరూ మరోసారి అయోమయంలో పడిపోయారు. ఇక అంతే కాకుండా ఇటీవల తుఫాను కారణంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తిగా ప్రాంతాలు జలమయమయ్యాయి. తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అటు శ్రీవారి భక్తులకు కూడా భారీ షాక్ తగిలింది.



 ఎందుకంటే కురుస్తున్న వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం మొత్తం తాత్కాలికంగా మూసివేశారు టిటిడి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెట్టు మార్గం నుంచి వరద నీరు వస్తూ రాళ్లు  విరిగి పడుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే నివర్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో ఉన్న పలు జలాశయాలు పూర్తిగా నీటితో నిండాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: