తెలంగాణలోని అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకం గా భావించిన జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ నేడు  జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కరోనా  బాధితులందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిహెచ్ఎంసి అధికారులు అవకాశం కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు.




 ఇక మొన్నటి వరకు అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకుని భారీ మెజారిటీ సాధించి విజయం సాధించడమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. అయితే ఇక ప్రచార రంగంలో ఏ అభ్యర్థులు ఓటర్లను ఎంతమేరకు ఆకట్టుకున్నారు ఎంతమేరకు అభివృద్ధి చేస్తారు అనే నమ్మకాన్ని ఓటర్లలో కల్పించారు అన్న విషయం నేడు తేల్చేయనున్నారు ఓటర్ మహాశయులు . కాగా ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పార్టీ గుర్తులకు కానీ అనుమతి ఇవ్వడం లేదు ఎన్నికల అధికారులు అన్న విషయం తెలిసిందే.




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలు టిఆర్ఎస్కు చెందిన వారు కొంతమంది గులాబీ రంగు మాస్కులు ధరించి రావడం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే.. టిఆర్ఎస్ కు చెందిన వారు గులాబీ రంగు మాస్కులు ధరించడం పై కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పిసిసి ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్ ఎన్నికల కమిషనర్ పార్థసారథికి  ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే స్పందించిన పోలీసు అధికారులు వారు  గులాబీ మాస్కులు తీసివేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కాగా ప్రస్తుతం నగరంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: