రాజ‌కీయాల‌కు అతీతంగా సేవ‌లు చేస్తూ ద‌క్షిణాది ప్ర‌జ‌లు అభిమానం చూర‌గొన్న న‌టుడు, ద‌ర్శ‌కుడు, నృత్య ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్‌. బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌తో అతి చిర‌కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగారు లారెన్స్‌. అయితే లారెన్స్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ చాలా కాలంగా ప్ర‌చారం జ‌రిగింది. ర‌జ‌నీకాంత్ స్థాపించ‌బోయే పార్టీలో కీల‌కంగా ఉండ‌ర‌న్న‌ది స‌ద‌రు ప్ర‌చారం సారాంశం. అయితే ర‌జ‌నీ పార్టీ స్థాపించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి అనుకున్నప్పుడు ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దాంతో రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం లేదంటూ చెప్పేశాడు.


 దీనిపై నిరాశ చెందిన తలైవర్‌ ఫ్యాన్స్‌ రీసెంట్‌గా ఆయన నిర్ణయం మార్చుకోవాలంటూ చెన్నైలో ఆందోళన చేశారు. చివరకు ఈ ఆందోళనపై కూడా రజినీకాంత్‌ స్పందించారు.  నిజానికి నేను రజినీ మక్కల్‌ మండ్రం మీటింగ్‌కు రానందుకు క్షమించండి. నేను అలా రాకపోవడానికి కారణముంది. చాలా మంది నాకు ఫోన్‌ చేసి ఎందుకు రాలేదంటూ అడుగుతున్నారు. అలాగే తలైవర్‌ను నిర్ణయం మార్చుకోవాలంటూ నేను సూచించాలని కూడా అంటున్నారు. అయితే అందరికీ నేను చెప్పేదొక్కటే. నిజానికి మన నాయకుడు మరేదైనా కారణం చెప్పి ఉంటే నేను ఆయన్ని రిక్వెస్ట్‌ చేసేవాడిని. కానీ.. ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన్ని మనం రిక్వెస్ట్ చేసి, ఆయనేమైనా నిర్ణయం మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చాడనుకోండి.


 ఆయనకు జరగరానిదేదైనా జరిగితే జీవితాంతం మనం అందరం బాధపడుతూ ఉండాలి. రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన నాకు గురువే. ఆయనకు సన్నిహితుడైన వ్యక్తిగా ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉంది. ఇప్పుడు మనమందరం ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆయన కోసం నా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయ‌ని రాఘవ లారెన్స్ తెలిపారు.మీ పిలుపున‌కు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే స్పందించ‌లేక‌పోయానంటూ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ఫ్యాన్స్‌కు నటుడు, కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: