ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ గా మారాడు నిమ్మగడ్డ రమేష్.. ఎన్నికల అధికారిగా మొన్నటివరకు ఎవరికీ కూడా తెలీని నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగానూ చర్చలో ఉంటున్నాడు.. రాష్ట్రంలో పదినెలలక్రితం మొదలైన ఎన్నికల  వివాదం ఇప్పటికీ నానుతూనే ఉంది.. కరోనా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేయించి  ఇప్పుడు విజృంభిస్తుంటే ఎన్నికలు నిర్వహించాలి అని మంకు పడుతూ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తున్నారు..  దీనిపై వైసీపీ నేతలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అయన ఏమాత్రం తగ్గకపోవడం వారికీ అస్సలు మింగుడు పడడం లేదు.

అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.. అయితే నిమ్మగడ్డ ఎంత హెచ్చరించినా వినకపోవడం ఒక ఎత్తు అయితే ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసి మరో సంచలనానికి తెరలేపాడు.. దానికి కోర్టు మొట్టికాయలు వేసింది అది వేరు అనుకోండి..  మరి కొన్ని రోజుల్లో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కానుండడంతో అప్పటివరకు ఎన్నికలు జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనా.. నిమ్మగడ్డ కూడా తనున్నప్పుడే ఎలక్షన్స్ ని పెట్టించి వైసీపీ ని ఓడించాలని ప్లాన్ వేశాడు.

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ రమేష్ మచ్చలా తయారయ్యాడని ఎన్నికల సంఘం అధికారులు అంటున్న మాట..రోజుకో కయ్యం, పూటకో వివాదం మాదిరిగా సాగుతున్న నిమ్మగడ్డ తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నప్పటికీ తన ధోరణిని మాత్రం వీడడం లేదు. తనకంటే ముందు విధులు నిర్వహించిన అధికారులు సదరు పదవిపై పెంచిన హుదాతనాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ‘కుందేటికి మూడు కాళ్ళే’’ అన్న సిద్ధాంతం మేరకు వ్యవహారాలు నడిపిస్తుండడం అభ్యంతరాలకు కారణమవుతోంది. ఏదేమైనా ఈ ఉదంతం లో చివరికి నిమ్మగడ్డ విలన్ గా తయారయ్యాడు.. ఒక పార్టీ కి కొమ్ము కాసే అధికారులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నిరూపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: