ఇప్పుడు అంతా ఆన్‌ లైన్ షాపింకే కదా.. కరోనా పుణ్యమా అని ఈ కామర్స్ సైట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ఇక పండుగలు, ప్రత్యేకమైన రోజులు వచ్చాయంటే ఈ సైట్లు ఆఫర్లతో పిచ్చెక్కిస్తాయి. ఇప్పుడు జనవరి 26 కోసం అనేక దిగ్గజ ఈ కామర్స్ సైట్లు ఆఫర్లతో విరుచుకుపడుతున్నాయి. నిజంగానే ఏదైనా కొనాలంటే ఆఫర్ చూసి కొనడం జనానికి కూడా బాగా అలవాటైపోయింది.

మరి ఈ జనవరి 26 సందర్భంగా ఏ సైట్లు ఏమేం ఆఫర్లు ఇస్తున్నాయో చూద్దాం.. అమేజాన్ సంస్థ ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ పేరుతో ఆఫర్లు ఇస్తోంది. రేపటి నుంచి ఈ ఆఫర్లు ప్రారంభం అవుతాయి. ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ జనవరి 23తో లాస్ట్. అయితే.. ప్రైమ్‌ చందాదారులకు మాత్రం ఒక్క రోజు ముందే అంటే.. ఇవాళ్టి నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చేశాయి. రెడ్‌మీ ఫోన్ 9ఏ ధర ₹9,499 ఉండగా.. ₹6,499కే ఇస్తున్నారు. ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌, ఫైర్‌ టీవీ స్టిక్‌ డివైజ్‌లపై అమెజాన్‌ 40శాతం వరకు డిస్కౌంట్ ఉంది.

టీవీ, వాషింగ్‌మిషన్‌ తదితర హోం అప్లియన్సెస్‌పై 60శాతం వరకు డిస్కాంట్ ఇస్తోంది అమెజాన్. అంతే కాదు.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి కొంటే పదిశాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది.  యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రో ఇయర్‌బడ్స్‌ ధర 24,900 ఉండగా.. 20,999కే అందిస్తోంది. వన్‌ప్లస్‌ 8టీ ఫోన్‌ను ₹40,499కే అమెజాన్‌ లో దొరుకుతోంది. ప్రస్తుతం 69,900కి అమ్ముడవుతున్న ఐఫోన్‌ 12 మినీపై కూడా అమెజాన్‌ డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది.

ఇక మరో పెద్ద సంస్థ ఫ్లిప్ కార్ట్‌  ‘బిగ్‌ సేవింగ్‌ డేస్‌’ పేరుతో ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ ఆఫర్లు జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ చందాదారులకు ఇవాళ్టి నుంచే ఆఫర్లు ఉంటాయి. ఐఫోన్‌ 11ను ₹50,299కు, మోటొరోలా మోటో జీ 5జీ ఫోన్‌ను ₹18,999కు ఫ్లిప్‌కార్ట్‌ అమ్ముతోంది. ఎలక్ట్రానిక్‌ అండ్‌ యాక్సెసరీస్‌ విభాగంలో 80శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. స్మార్ట్‌ టీవీ, అప్లియన్సెస్‌పై 75శాతం వరకు రాయితీ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వాడితే పదిశాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: