తెలంగాణ లో కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాల సంగతి తెలిసిందే.. వారిలో వారికే అసలు పడదు.. సీనియర్ లు అయితే పార్టీ లో తమదే పెత్తనం ఉండాలని కోరుకుంటారు. కొత్తగా ఎవరైనా వచ్చారంటే వారిని పార్టీ లో ఎదగనీయకుండా చేస్తుంటారు. రేవంత్ రెడ్డి విషయంలో ఇది ఇప్పటికే రుజువు అయ్యింది..  అందుకే కాబోలు పార్టీ ఇంత హీనమైన స్థాయికి చేరిపోయింది..కొత్తగా వచ్చిన వారికి సలహాలు ఇవ్వాల్సింది పోయి వారిని తొక్కేసే ధోరణి వల్ల పార్టీ పై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. అధికార పార్టీ ని నిలువరించాల్సి పోయి ఎదుగుతున్న బీజేపీ పార్టీ ని నిలువెరించే స్థితి కి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది.

అధికార పార్టీ ని ఎదుర్కునే ధైర్యం, బలం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కి అయితే లేదు. మొన్నటి ghmc ఎన్నికల ఫలితంతో కాంగ్రెస్ పొజిషన్ ఏంటో ప్రజలు తేల్చేశాడు. ఈ అవమాన భారంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఇంకా తెలసి ఉంది.. ఈ నేపథ్యంలో ఇటీవలే జరిగిన ఒక పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటిపైకి వచ్చి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.  ఇటీవలే రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వగా ఈ కార్యక్రమానికి అందరు నేతలు కలిసి కట్టుగా హాజరయ్యారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో నాయకులు పార్టీల్లో ఎవరిదారిలోవారు నడిచారు. ఫలితంగా ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలిసిందే. అయితే.. అనూహ్యంగా చలో రాజ్ భవన్ కు మాత్రం నాయకులు ఐక్యత ప్రదర్శించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు శ్రీనివాస్ కృష్ణన్ మధు యాష్కీ చిన్నా రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు జగ్గారెడ్డి పార్టీ సీనియర్లు వీహెచ్ పొన్నాల షబ్బీర్ అలీ అంజన్ కుమార్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ యూత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్తో పాటు వందలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: