తెలంగాణాలో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా అడుగులు వేస్తుంది. ప్రతీ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్న సిఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా ఇస్తూ వస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ నగర వాసుల కోసం మరో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. బస్తీ దావఖానాలలో భాగంగా ఈ రోజు 8 దయాగ్నస్టిక్ మిని హబ్ లను హైదరాబాద్ నగరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. తాజాగా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

పేద ప్రజలు వైద్యం కోసం  ఖర్చు చేసి ఇబ్బంది పడకూడదు అన్న  ముఖ్యమంత్రి  కేసిఆర్ ఆలోచనతో  బస్తీ దవాఖాన లు ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్లి  ఎక్స్ రే  ,అల్ట్రా స్కానింగ్.  చేయించాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన అన్నారు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో 8  డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రారంభించడం జరిగింది అని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగం పై భారీగా నిధులు ఖర్చు చేస్తూ హాస్పిటల్ అన్ని  కూడా ఆధునీకరించడం జరిగింది అని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో గాంధీ ఉస్మానియా ఇలాంటి హాస్పిటల్ లో లేటెస్ట్ టెక్నాలజీతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని ఆయన అన్నారు. పేదలు అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు అన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని ఆయన వివరించారు. అందుకే ప్రతి ఏరియాలో బస్తీ దవాఖాన ను ప్రారంభించడం జరిగింది అని మంత్రి తెలిపారు.   త్వరలోనే మరిన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాము అని అన్నారు. కరోనాను నియంత్రించడంలో.. కోసం  వైద్య ఆరోగ్య శాఖ.. అద్భుతంగా పని చేసింది అని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మరియు వైద్య సిబ్బంది అందరికీ అభినందనలు  చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: