తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు చాలా కీలకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా కష్టపడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ గనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కోలుకునే అవకాశాలు టిఆర్ఎస్ పార్టీని కల్పిస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

రాజకీయంగా తెలంగాణలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో విజయవంతం అయితే మాత్రం టిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

చాలా మంది నేతలకు భారతీయ జనతా పార్టీ నేతలు గాలం వేశారని రాజకీయవర్గాలు అంటున్నాయి. కొంతమంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభావం చూపితే ఆ పార్టీ వైపు కూడా ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా చాలా వరకు కూడా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు కూడా చోటు చేసుకోలేదు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని విషయాల్లో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుల కారణంగా చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు విజయవంతంగా ఎదుర్కొంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: