దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని రాష్ట్రాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఎలా అయినాసరే విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా పరిస్థితులు కనబడటంలేదు. ప్రస్తుతం ధరల పెరుగుదల అనేది కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనివలన ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి.

రాజకీయంగా మోడీ ఎంత బలంగా ఉన్నా సరే పెట్రోల్ ధరల విషయంలో వెనక్కు తగ్గలేదు అంటే మాత్రం భవిష్యత్ పరిణామాలు చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలామంది ఇప్పుడు పెట్రోల్ ధరల కారణంగా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు గానీ ఇప్పుడు తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇదే ప్రధాన సమస్యగా మారిందని అక్కడ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అయితే ఇప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు భారతీయ జనతా పార్టీతో కలిసి కొనసాగడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా తమిళనాడులో మనం కూడా తీవ్రంగా నష్టపోతున్నాం అని... మనం కూడా ఓటమి పాలయ్యే అవకాశాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ ని పక్కన పెట్టడమే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొంతమంది కీలక నేతలు కూడా అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయవర్గాలు అంటున్నాయి. స్టాలిన్ కూడా చర్చలు కూడా జరుపుతున్నారట ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: