ఏపీలో ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా సాగుతున్న రాజకీయాల్లో ఇప్పటిదాకా జగన్ ది పైచేయిగా కనిపిస్తోంది. జగన్ 2019 నుంచి ఏకపక్ష విజయాలతో టీడీపీకి షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇక ఏపీలో మళ్ళీ సైకిల్ జోరు చేస్తుందా అన్న డౌట్లు తమ్ముళ్ళకు వచ్చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీలో తమదే అధికారం, జగన్ అధికారంలో ఉండేది మూడేళ్ళు మాత్రమేనని చంద్రబాబు ఇప్పటిదాక పదే పదే చెబుతూ వస్తున్నారు. జమిలి ఎన్నికలు జరిగితీరుతాయని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరి జమిలి ఎన్నికలు అంటే మాటలా, పెద్ద తతంగమే ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, అధినాయకుడు మోడీ తలచుకుంటే ఏదైనా జరిగిపోవాల్సిందే.

అందుకే జమిలి ఎన్నికలకు మంచి ముహూర్తమే కేంద్రం రెడీ చేసి పెట్టిందని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే  ఏడాది జూలై తరువాత జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి. అంటే జగన్ కి అప్పటికి కచ్చితంగా మూడేళ్ళ అధికారం పూర్తి అవుతుంది. ఇంకా రెండేళ్ళ పాటు నిక్షేపంలా అధికారం ఉంటుంది. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ పూర్తిగా అయిదేళ్ళు ఉండకుండానే జమిలి ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.

అదే సమయంలో అయిదేళ్ల పాటు వైసీపీ ఆగడాలు భరించడం ఏలా అని తల పట్టుకుంటున్న చంద్రబాబుకు మూడేళ్ళకే మోక్షం ప్రసాదించేలా కేంద్రం జమిలి నిర్ణయం తీసుకోబోతోంది అంటున్నారు. అంటే జమిలి ఎన్నికలు జరిగితే అదృష్టం బాగుంటే టీడీపీ మళ్ళీ పగ్గాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అని బాబు గట్టి నమ్మకం మీద ఉన్నారట. జమిలి ఎన్నికలు అంటూ జరిగితే మాత్రం జగన్ కి అది గట్టి షాక్ అని చెప్పాల్సిందే.  ఇక కొత్త ప్రభుత్వాలు 2023 జనవరి 1న కొలువు తీరుతాయి అని అంటున్నారు. అలా ప్రతీ అయిదేళ్ళకు అదే డేట్ మీద జమిలి ఎన్నికలు జరిపేలా కేంద్రం కీలకమైన నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: