తెలంగాణలో మంత్రి హరీష్ రావు దెబ్బకు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినపడుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన నేతలలో హరీష్ ముందు వరుసలో ఉంటారు. సీఎం కేసీఆర్ కంటే కూడా ప్రజల్లో హరీష్ రావు ఎక్కువగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కూడా హరీష్ రావు తో చాలా మంది ఇతర పార్టీల నేతలు కూడా మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు హరీష్ రావుకి  టిఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత పెరుగుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన సరే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత హరీష్ రావు అవసరం టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా వచ్చింది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు విషయంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా జోక్యం చేసుకుని హరీష్ రావు ని ఇబ్బంది పెట్టకుండా నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్ రావు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు. హరీష్ రావుకి టిఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది అనే అంశాన్ని పదేపదే రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. తాజాగా కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచే నియోజకవర్గాల కు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించి ఓడిపోయే నియోజకవర్గాలకు మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నారు అంటూ ఆయన నేరుగా అని ప్రశ్నించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చలలో జరుగుతున్నాయి. హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీ దగ్గర చేసుకుంటుందని కొంతమంది అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: