నేడు మగువ మార్కెట్ సరుకైంది. ఎంత ధరైనా చెల్లించి పక్కలోకి లాగాలని చూసే పురుష పుంగవుల సంఖ్య అంత ఇంత అని చెప్పలేనంత.  కాస్త నజరున్న అమ్మాయిని చూస్తే నేటి పురుషుడు వికారపు చేష్టలు వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ఇక అధికారం చేతిలో ఉన్న వాళ్ళైతే చెప్పనవసరం లేదు. ఉద్యోగం ఇప్పించాలని కోరిన మహిళను లోబర్చుకుని, కామ కోరికలు తీర్చుకున్నారంటూ అతితీవ్రమైన ఆరోపణలు,


“మంత్రి రమేశ్ జర్కిహోలి, ఒక మహిళ (25) ను చంపేస్తానని బెదిరిస్తున్నారని, ‘కర్ణాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్’ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఆమె పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, మంత్రి గారు ఆ మహిళతో కలిసున్నప్పటి వీడియోలు, ఆడియోలే ఇందుకు సాక్ష్యాలంటూ బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త ‘దినేశ్ కుళ్లహళ్లి’ మంగళవారం సిటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 



సదరు సెక్స్ వీడియోలు కాస్తా లీక్ కావడంతో జాతీయ స్థాయిలో అవి సంచలనంగా మారాయి. అయితే, మంత్రి రమేశ్ ఎక్కడ? బెంగళూరు సిటీ లోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ చిత్రీకరించినట్లుగా చెబుతోన్న వీడియోలో రమేశ్ జర్కిహోలి, బాధిత మహిళ తో కలిసున్నప్పటి దృశ్యాలు కర్ణాటక రాజకీయాలను కుదిపేశాయి. వీడియోలు బయటికొచ్చిన తర్వాత మంత్రి సడెన్ గా కనిపించకుండా పోవడంతో ఆయన జాడ పై ప్రశ్నలు రేకెత్తాయి. గంటల సస్పెన్స్ తర్వాత మంత్రి రమేశ్, తాను మైసూరులో ఉన్నానంటూ ప్రకటన చేశారు.


 దీంతో యడ్యూరప్ప నాయకత్వంలోని కర్ణాటక బీజేపీ ప్రభుత్వ, మంత్రి వర్గంలో కీలక మంత్రి రమేశ్ జర్కిహోళి అడ్డంగా బుక్ అయ్యాడు. ఒక యువతితో గడిపిన వీడియో లీక్ అయ్యి ఆయన పరువు తీసింది. ఉద్యోగం ఇప్పిస్తానని, సదురుమంత్రి ఆ అమ్మాయిని తన శృంగార కేళికి వాడుకున్నట్లు సమాచారం.  


కర్ణాటక రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు మరీ బరితెగించి, మాన మర్యాదలు వదిలేసి వెగటు శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలిపోతున్నారు. గతంలో సాక్షాత్తు ప్రజాస్వామ్య ప్రతీక కర్ణాటక విధాన సౌధలో సరిగ్గా సభ జరిగేవేళ, నీలి చిత్ర వీక్షణలో - పలువురు మహనీయులు పట్టుబడ్డారు. ఆ పార్టీపార్టీ అని లేదు ఇలా బుక్కైన వెధవలు కాంగ్రెస్,  బీజేపీ ఎమ్మెల్యేలు అని నాడు గుర్తింపబడ్డారు. మన ఖర్మేమిటంటే ఆ వెధవలె నేడు మంత్రులయ్యారు.


బీజేపీ మంత్రుల్లో గతంలో అసెంబ్లీ లో బ్లూ-ఫిల్మ్ చూసినవారు ఉండడం దౌర్భాగ్యం. ఎదో పుకారేమో అనుకుందామని ఊరుకుంటుంటే తాజాగా వారి శృంగార వీడియోలు బయట పడడం పెను సంచలనంగా మారింది.


మంత్రి రమేశ్ గారు శృంగార ఢోలికల్లో మునిగి తేలినప్పుడు ముచ్చట పడి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు లా ఉంది. బట్టల్లేకుండా తీసుకున్న ఈ వీడియోలు ఇప్పుడు బయటకు రావడంతో పెద్ద దుమారం చెలరేగింది. కీలకమంత్రిగా ఉండి ఇలా చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీవీ చానళ్లు ఇప్పుడు హోరెత్తిస్తున్నాయి. గడిచిన కొద్దిగంటలుగా 'మంత్రిగారి రాసలీలలు' పేరుతో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోల వివాదం పై కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి “రమేశ్ జర్కిహోలి” ఎట్టకేలకు సదరు వీడియోల పైనా వివరణ ఇచ్చారు. “ఆమె ఎవరో తెలీదు”అంటూ.


‘‘మీడియాలో నాపై వస్తోన్న వార్తలు చూసి షాకయ్యాను. దేవుడి సాక్షిగా చెబుతున్నాను. ఆ మహిళ ఎవరో నాకు తెలీదు. ఇందులో ఏదో తప్పు జరిగింది. నాపై కుట్ర జరిగింది. సదరు వీడియో సీడీలు నూటికి నూరు శాతం నకిలీవే అని చెప్పగలను. ఈ వీడియోల వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ గిమ్మిక్కే అని భావిస్తున్నాను.

నన్ను, నా కుటుంబాన్ని బద్నాం చేయడానికే ఎవరో పనిగట్టుకుని ప్రయత్నిస్తోన్నట్లు అనిపిస్తోంది. దీనిపై, నేనెందుకు రాజీనామా చేయాలి? వీడియోల వ్యవహారంతో ముమ్మాటికీ నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు నేను మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాలి? ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర.


ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. మీడియాలో వార్తలు చూశాక నేను ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఫోన్ చేసి మాట్లాడాను. 21 సంవత్సరాలుగా రాజకీయా ల్లో ఉన్న నాపై ఏనాడూ ఆరోపణలు రాలేదు. ఈ వీడియోల గుట్టు ఏమిటో తేల్చాల్సిందిగా సీఎం ను కోరాను. దీన్ని సున్నితమైన అంశంగానే చూడాలని కోరుతున్నాను'' అని మంత్రి రమేశ్ జర్కిహోలి వివరణ ఇచ్చారు.


ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, మంత్రి “సెక్స్ స్కాండల్ వ్యవహారం” పై బెంగళూరు పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ వీడియో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో చిత్రీకరించినట్లు తెలియడంలో, ఆ స్టేషన్ లోనే కేసు నమోదు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.


పద్దతిగల బీజేపీలో ఉంటూ ఇలా ఒక మంత్రి చేయడం ఆ పార్టీ తల కొట్టేసినట్టు అయ్యింది. కాషాయ దళానికి ఇది తీరని అవమానంగా మారింది. భారతీయుల విలువలు, సంస్కృతీ  సంప్రదాయాలు అంటూచెప్పుకొనే పార్టీలో ఇలాంటి కళంకమంత్రి ఉండటం ఇప్పుడు వైరీ పక్షాలకు పండుగలగా మారింది.


నీచ కార్యానికి పాల్పడిన మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తోన్న నేపథ్యంలో మంత్రి స్వయంగా తన జాడపై మీడియాకు సమాచారం అందించి, పై విధంగా తన వెర్షన్ వినిపించారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: