దేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతాపార్టీ కొన్ని కొన్ని అంశాల్లో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొంటుందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొనే విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని కొన్ని అంశాల్లో కాస్త వివాదాన్ని రేపుతున్నాయి అనే భావన ఉంది. భారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కొన్ని అంశాల్లో దేశద్రోహం అంశాన్ని బాగా హైలెట్ చేస్తూ వస్తున్నారు. ప్రతి అంశంలో కూడా దేశద్రోహం ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయతా భావాన్ని పెంచే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు బీజేపీకి ఇదే పెద్ద సమస్యగా మారుతుంది అనే భావన కూడా ఉంది.

గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాయలో ఉన్న చాలామంది ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా సరే పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేసేవారు కాదు. కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన ఆరోపణలు అన్నీ కూడా నిజమే అనే భావన లో చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలలో బిజెపి ని ఇబ్బంది పెట్టే విధంగా సోషల్ మీడియాలో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. జాతీయవాదం విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చేస్తున్న పనులకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదు.

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా అమ్మే  ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ హైలెట్ చేస్తుంది. ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కొంత మంది కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: