తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ విషయంలో కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించే విషయంలో సీఎం కేసీఆర్ సమర్థవంతంగా వ్యవహరిస్తున్న సరే ఆయన అనుసరిస్తున్న వైఖరి కారణంగా చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఉన్న గౌరవం టిఆర్ఎస్ పార్టీలో ముందునుంచి ఉన్న నాయకులకు లేకపోయింది అనే ఆవేదన ఎక్కువగా వ్యక్తమవుతుంది.

రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో టీఆర్ఎస్లో ముందునుంచి ఉన్న నాయకులందరూ కూడా తీవ్రస్థాయిలో కష్టపడ్డారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మంత్రి పదవులు ఇవ్వడం ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను ఎక్కువ గుర్తించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. దీనిద్వారా టిఆర్ఎస్ లో అంతర్గతంగా సమస్యలు భారీగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని కొన్ని విషయాల్లో టిఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక లేకుండా వెళ్ళింది.

ఇతర పార్టీల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వాళ్లకు ఎక్కువగా అవకాశాలు కల్పించడంతో సీఎం కేసీఆర్ పై ప్రజల్లో కూడా అభిప్రాయం మ్మారింది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న జిల్లాల్లో కూడా ఇవి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి అని  కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి. కానీ ఈ విధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలకు అన్యాయం చేస్తే ఎలా అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని కొంతమంది వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని అందులో ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారని... ఇతర పార్టీలకు సహకరిస్తున్నారని కాబట్టి వాళ్ల మీద దృష్టి పెట్టాల్సింది పోయి టిఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ మీద ఎలా పెడతారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: