దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడి పోతుంది.  ఇక కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఎన్నో జీవితాలు అల్లకల్లోలమై పోతున్నాయి. సాఫిగా సాగిపోతున్న జీవితంలో కరోనా వైరస్ గడిచి పోనీ పీడకలగా మారి పోయింది.  అయితే ఇక కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన తెచ్చు కుంటున్నారు.  ఈ క్రమంలోనే వైరస్ సోకినప్పటికి భయ పడటం లేదు.  మనో ధైర్యంతో వైరస్ను జయిస్తున్నారు. అయితే అటు దేవుడు మాత్రం చిన్న చూపు చూస్తూనే ఉన్నాడు.



  వైరస్ ను మనో ధైర్యంతో జయించామని సంతోష పడుతున్న సమయంలో.. మరోవిధంగా ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్నాడు.  ఇటీవలే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ సోకడం లాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి .  ఇక బ్లాక్ ఫంగస్ తర్వాత వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లాంటి వి కూడా దేశంలో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించాయి.  దీంతో ప్రతి ఒక్కరు అడుగడుగునా ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. అయితే ఇక ఇటీవల దేశంలో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లే కాదు..  కొత్త ఫంగస్ కూడా వెలుగు లోకి వచ్చేసింది  .



 దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ఫంగస్ మొదటి కేసు నమోదు అయ్యింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఊపిరితిత్తుల్లో ఏకంగా 90 శాతానికి పైగా గ్రీన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.  దీంతో అతనిని వెంటనే విమానంలో ముంబైలోని హిందూజా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటికే మూడు రకాల ఫంగస్ లు వెలుగులోకి వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.  ఇప్పుడు మరో కొత్త ఫంగస్ కూడా వెలుగులోకి రావడంతో భారత ప్రజానీకం మొత్తం వణికిపోతోంది. కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషపడుతుంటే.. మళ్ళీ ఇదేం కర్మ రా దేవుడా అంటూ వణికి పోతున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: