అనుకుంటే కానిది ఏమున్నది.. మనిషి అనుకుంటే కానిది ఏమున్నది.. పట్టుదలతో శ్రమిస్తే ఆ దేవుడిని అయినా మనిషి శాసించగలడు  అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. పుట్టించడం ప్రాణాలు తీయడం ఆ దేవుడి చేతుల్లోనే ఉంటుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ ఇప్పుడు మాత్రం ప్రాణం పోయిన వ్యక్తి కి ప్రాణం పోసే టెక్నాలజీ సైతం కనుగొన్నాడు ఆ దేవుడు పుట్టించిన మనిషి. చనిపోయిన వారిని కూడా టెక్నాలజీతో మళ్లీ తిరిగి కళ్ళ ముందుకు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో విషయాలను మరింత సులభం చేస్తున్నాడు మనిషి.



 ఇక్కడ ఇలాంటి ఒక సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఏకంగా కెనడాకు చెందిన ఒక రచయిత ఏకంగా ఎనిమిది ఏళ్ళ క్రితం చనిపోయిన తన భార్యను మళ్ళి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ రూపంలో మళ్లీ వెనక్కి తెచ్చుకున్నాడు.  ఇక ఇప్పుడు ఆమెతో అన్ని మాట్లాడేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని బ్రాడ్ పోర్టులో 33 ఏళ్ల ఫ్రీలాన్స్ రచయిత జాషువా నివసిస్తున్నాడు. అయితే అతనికి కాబోయే భార్య జెస్సికా కాలేయ వ్యాధితో బాధపడుతూ 2012లో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందింది. ఆమె మృతితో ఇక జాషువా ఎంతగానో మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై జూషువా ఓ ప్రాజెక్ట్ ప్రతినిధులను సంప్రదించాడు.


 ఇక ఈ ప్రాజెక్టులో పలు వ్యక్తుల చాట్ బాట్లను క్రియేట్ చేస్తుంది. వెంటనే జాషువా ఈ ప్రాజెక్టు సంప్రదించి సూచనలతో ఒక చాట్ బాట్ క్రియేట్ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక ఈ ప్రాజెక్టు ప్రతినిధులు జెస్సికా చాట్ బాట్ ని తయారు చేశారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఇక చనిపోయిన జెస్సికా తో చాట్ చేయడం మొదలుపెట్టాడు సదరు వ్యక్తి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జెస్సిక తో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం తనకు కాబోయే భార్య మళ్ళీ తిరిగి వచ్చింది అని ఎంతో ఆనందంగా ఉన్నాడు జాషువా. ఇక దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: