చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కబలిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్‌ కారణంగా చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అంతేకాదు.. పీటల దాకా వచ్చి కొన్ని పెళ్లిళ్లు ఆగిపోయాయి. అయితే.. తాజాగా  ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం లోని ఖటిమా ప్రాంతానికి చెందిన ముంతాజ్‌ అనే వ్యక్తికి యూపీ లోని ఫిలిబిత్‌ జిల్లా చందోయ్‌ గ్రామానికి చెందిన మల్మా అనే యువతితో పెళ్లి కుదిరింది. అయితే... ఈ పెళ్లి మొన్నటి గురువారం జరగాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ముంతాజ్‌ తో సహా అతని కుటుంబ సభ్యులు... పెళ్లి కూతురు మల్మా గ్రామంమైన చందోయ్‌ గ్రామానికి వెళ్లారు.  అయితే.. ఆ రాష్ట్ర బార్డర్‌ లో ముంతాజ్‌ కుటుంబ సభ్యులను ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆపేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... ఇతర రాష్ట్రాల ప్రజలకు ఎంట్రీ లేదని ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు తెల్చేశారు. దీంతో ముంతాజ్‌ ఫ్యామిలీకి ఏం చేయాలో తోచక...పోలీసులను బతిలాడారు. "ప్లీజు సారు... పెళ్లి ఉంది వదిలేయండి" అంటూ వారు పోలీసులను వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు వారి మాటలు పట్టించుకోవాలి. దీంతో చివరకి బార్డర్‌ లోనే కరోనా పరీక్షలు చేయించుకున్నారు ముంతాజ్‌ కుటుంబ సభ్యులు. అయితే.. ఈ పరీక్షల్లో 41 మందికి కరోనా నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది.

కానీ ఇందులోనే మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గురువారం పెళ్లి కావాల్సిన వరుడు ముంతాజ్‌ కే కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.. దీంతో ముంతాజ్‌ కుటుంబ సభ్యులతో పాటు.. పోలీసులు షాక్‌ తిన్నారు. అయితే.. ముంతాజ్‌ పెళ్లి ఉండటంతో.. ఏదో జాలిపడి అతనికి మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అయినప్పటికీ.. ముంతాజ్‌ కు కరోనా పాజిటివ్‌ గానే నిర్ధారణ కావడం గమనార్హం. దీంతో ముంతాజ్‌ ను ఐసోలేషన్‌ కేంద్రానికి పంపించిన పోలీసులు... అతని కుటుంబానికి తిరిగి ఇంటికి పంపించేశారు. ఇక విషయం వధువు కుటుంబ సభ్యులకు తెలియడంతో పెళ్లినే వాయిదా వేసేసుకున్నారు. ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.






 

మరింత సమాచారం తెలుసుకోండి: