భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని అందరికీ తెలుసు. సాంకేతికత విషయంలో మన దేశంతో పోల్చితే ఇతర దేశాలు చాలా మందు ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీస్ యూసేజ్‌తో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. కాగా, తాజాగా కేంద్రం చేసిన ఓ ప్రకటన ద్వారా ఆ విషయంలో భారతదేశమే అన్నిటికంటే మందుందని తేలింది. ఇంతకీ ఆ విషయమేంటంటే..


కొవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో మన దేశం మాన్యువల్‌గా కొన్ని పనులు చేసింది. ఉదాహరణకు శానిటైజేషన్, ఇతర మెడికల్ విషయాల్లో యంత్రాలు, సాంకేతికతను విదేశాలు బాగా ఉపయోగించాయి. అయితే, మనదేశంలోనూ సాంకేతికత యూసేజ్ పెరిగినప్పటికీ అమెరికా, చైనా, జపాన్‌తో పోల్చితే తక్కువే. కాగా, డిజిటల్ చెల్లింపుల విషయంలో ఇందుకు భిన్నమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ మంత్రి ధ్రువీకరించారు. నార్మల్‌గానైతే అమెరికా, చైనా వంటి అడ్వాన్స్‌డ్ కంట్రీలోనే ఎకానమీ గ్రోత్ ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడే డిజిటల్ ట్రాంజాక్షన్స్ వైపు జనాలు మొగ్గుచూపుతుంటారని అనుకుంటాం. కానీ, వాటిని వెనక్కి నెట్టేంత స్థాయి భారత్‌కు ఉందని అనుకోం.

 
డిజిటల్ ట్రాంజాక్షన్స్ విషయంలో అమెరికా, చైనాను దాటేసింది భారత్. వరల్డ్‌లోనే హైయెస్ట్ పేమెంట్స్ చేసిన కంట్రీగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలియచేయడం  విశేషం. గతేడాది భారతదేశంలో 25.4 బిలియన్ల డిజిటల్ ట్రాంజాక్షన్స్ జరిగాయని పేర్కొన్నాడు. ఇక చైనాలో 15.7 బిలియన్లు, అమెరికాలో 1.2 బిలియన్  ట్రాంజాక్షన్స్ జరిగాయి. సదరు గణాంకాల ప్రకారం..భారత్ అమెరికా కంటే 21 రెట్ల ట్రాంజాక్షన్స్ ఎక్కువ చేశాయని, చైనాతో పోల్చితే 1.6 రెట్లు ఎక్కువ ట్రాంజాక్షన్స్‌ను భారత్ చేసింది. కేంద్రమంత్రి చేసిన పోస్ట్ లో ‘విశ్వ గురు ఇన్ డిజిటల్ ట్రాంజక్షన్’ అని పేర్కొన్న వాక్యం ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందరి దృష్టిని ఇది ఆకర్షిస్తోంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ ద్వారా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: