విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన ప్రతిఒక్కరికీ తాను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు అన్నారు. తెలుగు వారి త్యాగం, ఆత్మగౌరవం నుండి పుట్టినదే విశాఖ స్టీల్ ప్లాంట్ అని వ్యాఖ్యానించారు. 32 మంది ప్రాణత్యాగాల నుండి పుట్టిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు అన్ని పార్టీలు క‌లిసి పోరాడాలని రామ్మోహ‌న్ నాయుడు కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల హక్కు.....స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాము అంటే ఊరుకునేదేలేదని లేద‌ని కేంద్రానికిర వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం ఆంధ్రావాళ్ళను చిన్న చూపుచూస్తుందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారిని ఆదుకోవాలని తాను ప్రధానమంత్రిని కోరుతున్నాన‌ని చెప్పారు. 

స్టీల్ ప్లాంట్ కు కాపిటల్ మైన్స్ ఇస్తే బాగుటుందని పార్లమెంట్ కమిటీ కూడా అదే చెప్పిందని అన్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా స్టీల్ ప్లాంట్ అంశం పై మాట్లాడారు. విశాఖ ఉక్కును రక్షించుకునే పని లో అందరూ ఉన్నారని కేశినేని నాని చెప్పారు. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ పోరాటంలో  మొత్తం 32 మందిని ప్రాణాలు కోల్పోయారని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్టంలో ప్ర‌జ‌లు కూడా ఉక్కు ప్లాంట్ కోసం ఉద్యమించారని వెల్ల‌డించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చాలా బాధాకరం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

లక్షల కోట్లు వచ్చే భూములు విశాఖ స్టిల్ ప్లాంట్ కార్మికుల హక్కు అని కేశినేని నాని స్ప‌ష్టం చేశారు. స్టీల్  ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం టీడీపీ పార్లమెంట్ లో కూడా పోరాటం చేస్తుందని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్టాలను పట్టించుకోవడం అప‌లు ప‌ట్టించుకోలేని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిర్వాసితులకు మిగిలిన భూమిని కేటాయించండని కేశినేని నాని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కూర్చొని తాము నిర్ణయం తీసుకున్నామంటే ఎలాగ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. లక్షమంది విశాఖ స్టిల్ ప్లాంట్ పై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా ఆంధ్రుల హ‌క్కుగా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై ఏపీలో అన్ని పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. కేంద్రం మెడ‌లు వంచేందుకు సిద్ధం అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: