
మన దేశం నుంచి పతకాలు సాధించింది వీళ్లే.. నార్త్-ఈస్ట్ కు చెందిన సైఖోమ్ మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టర్), లోవ్లినా బోర్గోహైన్ (బాక్సర్), షంగలక్పామ్ నీలకంఠ్ శర్మ (పురుషులు, హాకీ ప్లేయర్) కాంస్య పతకాన్ని సాధించారు. అలాగే నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) స్వర్ణం, రవి కుమార్ దహియా (రెజ్లింగ్) రజతం, బజరంగ్ పునియా (రెజ్లింగ్) కాంస్యం, పివి సింధు (బ్యాడ్మింటన్) కాంస్యం దీంతో పాటు భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచింది.
38 శాతం నార్త్-ఈస్ట్ రాష్ట్రాల క్రీడాకారులు ఉన్నారు. అయితే ఒలింపిక్స్‌లో దేశానికి కీర్తి సాధించి పెట్టడం ఆ రాష్ట్రాలకు కొత్తేమి కాదు. గతంలో మేరీ కోమ్, బైచుంగ్ భూటియా వంటి ఈశాన్య దేశాల ఆటగాళ్లు దేశం.. ప్రపంచంపై ఆధిపత్యం చేశారు.
ఈశాన్య భారతదేశాన్ని స్పోర్ట్స్ నర్సరీ అని ఎందుకు పిలుస్తారు? ప్రతికూల పరిస్థితులు ఉన్నా..అక్కడి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్తాయలో సత్తా ఎలా చాటడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయని క్రీడా నిపులు పేర్కొంటున్నారు.
వాతావరణం.. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ఎక్కువ వేడి లేదా ఎక్కువ చల్లదనం ఉండకుండా ఇంచుమించుగా జపాన్, జకార్తా వంటి వాతావరణం పోలి ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఒలింపిక్ క్రీడల వద్ద ఉండే వాతావరణ పరిస్థితులకు సరిగ్గా పోలి ఉంటాయి. టోక్యో వాతావరణం చాలావరకూ ఈశాన్యరాష్ట్రం వాతావరణంలాగే ఉంది.
ఆహరం.. ఈ ప్రాంతాల్లో ఎరువులు లేకుండా పండిన ఆర్గానిక్ పంటలను, ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకుంటారు. ఇక్కడ తులసి ఆకులతో కలిపి చికెన్ చేస్తారు. అలాగే ఆహారంలో వెన్న, నెయ్యి తప్పనిసరిగా తింటారు. అలాగే చేపలు, సోయాబీన్స్, పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకుంటారు. చికెన్, పోర్క్, బీఫ్, మటన్ ఇక్కడ సర్వ సాధారణమైన ఆహర పదార్థాలు.
ఒక అథ్లెట్ సాధారణంగా రోజుకు 2500 నుంచి 300 కేలరీల ఆహరం తీసుకోవాలి, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సాధారణంగానే అన్ని కేలరీలు ఉన్న ఆహరం తీసుకుంటారు. అంతకు తగ్గ శారీరక కష్టం చేస్తారు. అదేవిధంగా ఇక్కడ అడవుల్లోదొరికే ప్రాకృతిక వైద్య మొక్కలను కూడా వీరు నిత్యం ఆహారంగా తీసుకుంటారు.
పోటీతత్వం.. ఇక్కడి ప్రజల్లో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు ఓటమిని అంత త్వరగా ఒప్పుకోరు. గెలుపు కోసం నిత్యం కష్టపడే ఈ జీవన విధానం క్రీడలకు సరిగ్గా ఉంటుంది.