రాజ‌కీయ పార్టీలు చేస్తున్న పోరాటాల్లో ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగ స‌మ‌స్య‌ను లేవ‌నెత్తుతున్నారు. తెలంగాణ‌లో నిరుద్యోగానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌, బీజేపీ లు మాట్లాడుతున్నాయి. మొన్న‌టికి మొన్న తెలంగాణ‌లో పార్టీ పెట్టిన వైఎస్ ష‌ర్మిల కూడా ప్ర‌ధానంగా నిరుద్యోగం పైనే కాన్‌సెంట్రేష‌న్ చేసి ఆ దిశ‌లో కేసీఆర్ పై విమ‌ర్శ‌లు సందించింది. అయితే, ఆయా పార్టీలు నిరుద్యోగుల కోసం చేస్తున్న ఉద్య‌మాల‌ల్లో ఉద్యోగం లేని యువ‌త ఎంత‌మేర‌కు పాల్గొంటున్నారు. అస‌లు నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటంలో నిరుద్యోగ యువ‌త ఎందుకు పాల్గొనడం లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవ‌క మాన‌దు..

 
    రాజ‌కీయ పార్టీలు చేసే ఉద్య‌మాల్లో, పోరాటాల్లో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు మాత్ర‌మే ఎక్కువ‌గా పాల్గొన‌డం మ‌నం చూస్తాం. అలాగే డ‌బ్బులు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను పార్టీల కార్య‌క్ర‌మాల‌కు స‌భ‌ల‌కు తీసుకెళ్ల‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. అలాంటిది వారి కోసం పోరాటం చేస్తున్న రాజ‌కీయ ఉద్య‌మాల్లో నిరుద్యోగ యువ‌త ఎందుకు భాగ‌స్వామ్యం కాలేక‌పోతున్నార‌నే ప్ర‌శ్న వ‌స్తుంది. దేశంలో దాదాపు కోట్ల‌లో నిరుద్యోగులు ఉంటారు. వాళ్లందరూ రాజ‌కీయ పోరాటంలో భాగ‌స్వామ్యం కాలేక‌పోతారు.


   రైతుల‌కు వ్య‌తిరేకంగా తీసుకువ‌చ్చిన రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. మ‌రి నిరుద్యోగులు ఎందుకు ఉద్య‌మం చేయ‌డం లేద‌నేది గ‌మ‌నిస్తే.. నిరుద్యోగులు యునైటెడ్ గా లేక‌పోవ‌డం. ఒక కామ‌న్ అస్తిత్వం లేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణం. అలాగే మాన‌సిక స్థితి.. త‌న వైఫ‌ల్యం వ‌ల్లే ఉద్యోగం రాలేద‌ని నిరుత్సాహం చెంది మిన్న‌కుండి పోతారు. కానీ, నిరుద్యోగం వ్య‌వ‌స్థాగ‌త వైఫ‌ల్యం అని అనుకోరు.



 అలాగే.. ఉద్యోగులు ఉద్య‌మంలోకి రావాలంటే ఆర్థిక వ‌న‌రులు కావాలి.. సంస్థాగ‌త నిర్మాణం కావాలి. ఇంకో కార‌ణం ఏంటంటే నిరుద్యోగుల రాజ‌కీయంగా డివైడ్ అయి ఉంటారు. దీని వ‌ల్ల ఒక పార్టి తీసుకున్న నిర్ణ‌యాల‌కు అంద‌రు సుముఖంగా ఉండ‌రు.. అలాగే వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌రు. నిరుద్యోగుల అసంఘటితంగా ఉండ‌డంతో ప్ర‌భుత్వాల‌కు భ‌య‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. దీంతో మ‌న‌కెందుకు లే అని ముందుకు రాని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇలా వివిధ కార‌ణాల‌తో పార్టీల‌ ఉద్య‌మాల్లో నిరుద్యోగుల‌ స్థానం, స్పంద‌న ఎక్కువ‌గా క‌నిపించ‌దు.




మరింత సమాచారం తెలుసుకోండి: