జర్మనీలో తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది. దీనితో అక్కడ ఇప్పుడు సోషల్ డెమొక్రాట్లు అధికారం చేజిక్కించుకున్నారు. దాదాపు గత ప్రభుతం 16 ఏళ్లపాటు అధికారం లో నే ఉంది. జర్మనీ తొలి మహిళా ఛాన్సులర్ గా మరియు శక్తివంతమైన మహిళగా పేరుగాంచిన ఏంజెలా మోర్కెల్ ఈ ఎన్నికలలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఆమె ఈ ఎన్నికలకు ముందే తాను తదుపరి ఎన్నికలలో పోటీ చేయబోనని చెప్పారు. అందుకే  ఈ ఎన్నికలలో తన రాజకీయ వారసుడిగా భావించిన ఆర్మీన్ తరుపున ప్రచారంలో పాల్గొన్నారు.

సుదీర్ఘంగా జర్మనీకి ఛాన్సలర్ గా ఉన్న ఏంజెలా ప్రపంచం ముందు ఆ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. అంతర్జాతీయంగా ఈమె కీలక పాత్ర పోషించారు.  ఈయూ- ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ఆమె పాత్ర మరువలేనిది. ఈయూలో ఆమె దేశాన్ని గొప్ప శక్తివంతమైన దేశంగా  నిలపడంతో సఫలం అయ్యారు. 2007 లో దేశంలో ఆర్థిక సంక్షోభం, గ్రీకు అప్పుల సంక్షోభం, 2016లో బెర్లిన్ లో ఉగ్రవాదుల దాడులు నుండి ప్రస్తుత కరోనా వరకు సమర్థవంతంగా ఎదుర్కోవడం చూశాం.

తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఏంజెలా పార్టీ ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన జర్మనీ ఎన్నికలలో సోషల్ డెమొక్రాట్లు గెలుపు తీరాలు అందుకునాన్రు. ఈ  ఎన్నికలలో సెంటర్ లెఫ్ట్ సోషల్ డెమొక్రాట్స్ (ఎస్పీడీ )26శాతం ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఏంజెలా పార్టీ సీడీయూ / సీఎస్.యూ 24. 5 శాతం ఓట్లు సాధిస్తాయని సర్వేలు ముందుగానే చెప్పాయి. అయితే సుదీర్ఘంగా అధికారంలో ఉన్న ఏంజెలా తరువాత అధ్యక్ష పదవి లోకి ఎవరు వస్తారు అనే ఆసక్తి అందరికి ఉంది. ఈ ఎన్నికలలో గట్టి పోటీ లేనప్పటికీ, ఏంజెలా వెనకంజలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇక సోషల్ డెమొక్రాట్లు కూడా తామే అన్ని సర్వేల్లో ముందున్నట్టు ఓటు వేసిన అనంతరం చెప్పుకొన్నారు.  మొత్తానికి ఈసారి కూటమితో కూడిన ప్రభుత్వం కొలువు తీరనున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: