ఇరిగేషన్ ప్రొజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఎంపీ రఘురామ ఆరోపించారు. రాయలసీమకు డ్రిప్ ఇరిగేషన్ పై ఫోకస్ చేయాలి అని ఆయన కోరారు. గత రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్నం పెట్టే స్కీమ్ డ్రిప్ ఇరిగేషన్..దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని మండిపడ్డారు. బిల్లులు చెల్లించడం లేదు...టెండరింగ్ కి ఎవరు రావడం లేదు అని ఆయన కామెంట్ చేసారు. రాజన్న రైతు భరోసా కేంద్రాల పై అనేక వార్తలు వస్తున్నాయి అని అన్నారు.

బస్తాకు అదనంగా బిల్లులు వసూల్ చేస్తున్నారు...సీఎం దాన్ని పరిశీలించాలి అని విజ్ఞప్తి చేసారు. ఏపీ ఎం.ఐ పి తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయండి అని ఆయన కోరారు. చేయాలనే చిత్తశుద్ధి ఉంటే లక్షల ఎకరాలకు నీళ్లు అందించవచ్చు అని అన్నారు. మాంసం షాపులు నిర్వహిస్తాము,సినిమా టికెట్లు అమ్ముతాము అనడం అనవసరం  అన్నారు ఆయన. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అని విజ్ఞప్తి చేసారు. ఎన్నికలు వస్తున్నాయి అనవసర విషయాలలో జోక్యం మంచిది కాదు.. మన పార్టీ బతికి బట్టకట్టాలంటే మంచి పనులు చేయండి అని ఆయన కోరారు.

స్కూల్స్ పై కన్ను వేశాము..ఇప్పుడు కాలేజీల స్థలాల పై కూడా  అంటూ ఆయన వ్యాఖ్యానించారు. స్థల యజ్ఞం పార్ట్..2 స్టార్ట్ అయింది అని విమర్శలు చేసారు. రాష్ట్రంలో 286 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి అని ప్రతి నియోజకవర్గంలో కాలేజీలు కడుతాము అన్నారు..రాష్ట్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని వ్యాఖ్యానించారు. సలహదారుడి సలహామేరకు ప్రైవేట్ పాలిటెక్నిక్ కలశాలలు మాకు ప్రభుత్వానికి ఇచ్చేయమనడం మంచిది కాదు అన్నారు. ఎవరిదో కాలేజి స్థలం ఇవ్వమనడం ఏంటి...మీ ఇల్లు ఇవ్వమంటే ఇస్తారా....సీఎం గారు అని నిలదీశారు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే మొట్టికాయలు పడుతాయి అన్నారు. చాలా చోట్ల పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి వేరొ పనులు చేస్తే శిక్ష తప్పదు అని సీజేఐ ఎన్వీ రమణ ఒక తీర్పు సందర్భంగా చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp