అవును.. గెహ్లాట్ వెనక్కి తగ్గారు
 
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజకీయంగా వెనక్కి తగ్గారు. తన నిర్ణయాలను సమీక్షించుకుంటున్నారు. ఇది నిజం. నెల రోజులుగా  ఇంటి పోరు, వెలుపలి పోరుతో గడబిడ గా గడుపుతున్న  గెహ్లాట్ తన నిర్ణయాలను ఒక్కోక్కటిగా సమీక్షించుకుని, వెన క్కి తీసుకుంటున్నారు. గత నెలలో  రాజస్తాన్ అసెంబ్లీ  ముందుకు వచ్చిన వివాహ చట్టం రిజిస్ట్రేషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు గెహ్లాట్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ కు లేఖ కూడా రాశారు.
భారత్ లో వివాహం చేసుకోవాలంటే మహిళలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు కనీస వయస్సు ఉండాలి. ఇది భారత రాజ్యాంగంలోని నిబంధన.  గెహ్లాట్  తీసుకు వచ్చిన చట్టంలో మైనార్దీ తీరని మహిళల విషయంలో తల్లితండ్రులు నెలరోజులు ముందుగా సమీపంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పెర్లు నమోదు చేసుకుంటే ఆ నిర్ణయించిన  ముహూర్తం ప్రకారం వివాహం చేసుకోవచ్చు. ఇది చాలా వివాదాస్పద మైంది. సుప్రీం కోర్టులోనూ ఈ విషయమై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసుని  ప్రాధమికంగా విచారణ చేసిన సర్వోన్నత న్యాయస్థానం  అఫిడవిట్ దాఖలు చేయాలని రాజస్తాన్ ప్రభుత్వాన్ని అదేశించింది. అదే సమయంలో  గెహ్లాట్ మంత్రి వర్గ సభ్యుడు,  ప్రియాంక గాంధీ వద్రాకు సన్నిహిత మిత్రుడు సచిన్ పైలెట్ కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి  ఈ విషయంలో ఫిర్యాదు చేశారు. తన మంత్రి వర్గ సభ్యుడు, అసమ్మతి నేత అయిన పైలెట్  వ్యతిరేకించడం, ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం తో పాటు, న్యాయ స్థానం కూడా వివరణ కోరడంతో  రాజస్థాన్ ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
వివాహ ని ర్దేశిత వయసు కన్నా తక్కువ ఉన్న వారు పెండ్లి చేసుకుంటే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమాన విధిస్తారు. రెండు కూడా విధించే అవకాశం ఉందని బాల్య వివాహ నిషేధ చట్టం. బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారు కూడా శిక్షనుంచి తప్పించు కోలేరు.
బాల్య వివాహాలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను ప్రోత్సహించదని అశోక్  గెహ్లాట్  తన నిర్ణయాన్ని వెనక్కి తూసుకున్న తరువాత  పేర్కోన్నారు. రాష్ట్రంలో ఏ మూల  బాల్య వివాహాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.  అదే సమయంలో వివాహాలను చట్టబద్దం చేయాలన్న తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఏ వివాహం అయినా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుందనేది తన అభిప్రాయమని గెహ్లట్ పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: