మయన్మార్ అలియాస్ బర్మాలో సైనికుల అరాచకాలు కొనసాగుతున్నాయి. మూడులో రెండొంతుల మెజారిటీతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినా ప్రయోజనం లేకుండా సూచి ని మళ్ళీ ఇంటికి పరిమితం చేశాయి. దానికి వెనుక కూడా చైనా అరాచక వ్యూహం ఉంది. కారణం సాధారణంగా ఎప్పటి నుండో బర్మాలోని అసెంబ్లీ లో 25శాతం సీట్లను సైనికులకు కేటాయించడం ఎప్పటి నుండో కొనసాగుతుంది. అయితే అది అడ్డంపెట్టుకుని సైన్యాన్ని వేరే వారు ఆడిస్తుండటంతో దేశం పరోక్షంగా వేరే వారి పాలనలో నడుస్తుందని సూచి గ్రహించి ఆ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇది గ్రహించిన చైనా తనకు నష్టం వాటిల్లుతుందనే అక్కసుతో సూచి ప్రభుత్వాన్ని కుప్పకూల్చి మళ్ళీ సైనికపాలన తెచ్చింది.

సూచి అత్యంత మెర్జరీటీ తో గెలిచి, ఆయా చట్టాలలో మార్పులు చేసేలోపు ఆమె ప్రభుత్వం చెల్లదని సైన్యం హడావుడిగా ఆమెను ఖైదు చేసి ఇంటికి పరిమితం చేశారు. అప్పటి నుండి అక్కడ ప్రజలు తీవ్రంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సైనికుల దగ్గర ఆయుధాలు ఉండటంతో, ప్రజలు కూడా ధీటుగా సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఆయుధాలను సమకూర్చుకున్నారు. ఇదంతా జరుగుతున్న సందర్భంలో సైన్యం చేతికి చిన్నిన వారిని అరెస్టులు చేస్తూ హింసిస్తూ ఉంది. అయితే ప్రపంచదేశాలు సైన్యం చర్యలను ఖండిస్తుండటంతో తాజాగా అలాంటి 5600 మందిని విడిచిపెట్టింది. అయితే వీరందరిపై దేశద్రోహం కేసులు పెట్టి అనంతరం మాత్రమే విడిచిపెట్టింది.  

ఈ మార్పు వెనుక కూడా అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నది తప్ప స్వతహాగా సైన్యంలో కలిగినది కాదు. ఇంకా ప్రజలు మాత్రం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అక్కడ రోజు హింసలు జరుగుతూనే ఉన్నాయి. చైనా అక్కడి సైన్యానికి అండగా ఉండటంతో ఈ పోరాటంలో ప్రజలు ఇప్పుడప్పుడే గెలిచే అవకాశాలు కనిపించడంలేదు. మయన్మార్ విషయంలో ప్రపంచ దేశాలు కూడా ఏకకంఠంతో వ్యతిరేకిస్తుంటే, చైనా మాత్రం వెనకేసుకొస్తుండటంతో ఆ దేశమే మయన్మార్ సైనికులను రెచ్చగొట్టి ఇదంతా వెనక ఉండి నడిపిస్తున్నట్టే అందరికి తెలిసిపోతుంది. ఇలా చైనా తన తప్పిదాలు అన్ని ఒక్కటొక్కటిగా బట్టబయలు చేసుకుంటూ ప్రపంచం ముందు దోషిగా మిగులుతుంది. ఇప్పటికే చైనా పూర్తిగా సంక్షోభంలో మునిగి పోయిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: