ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో సైనిక పాలన ఇటీవల పెరిగిపోతుంది. మొన్న మయన్మార్, నిన్న సూడాన్. తాజాగా సూడాన్ లో సైనికులు తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దుచేసి తమ పాలన ప్రకటించుకున్నారు. తాత్కాలిక ప్రధానిని పథకం ప్రకారం ఖైదు చేశారు.  ఆ విషయం బయటకు పొక్కకుండా జాగర్త పడ్డారు. అయితే తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ప్రజలకు వాస్తవం అర్థమై రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలా బలవంతంగా దేశాలను తమ చేతులలోకి తీసుకునే ఆచారం మొదలు పెట్టింది చైనా. గత మయన్మార్ చర్యల వెనుక కూడా ఆ దేశమే ఉంది. నేడు ఈ దేశం వెనుక కూడా అదే ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. మరోదేశం తుపాకుల చేతిలోకి వెళ్ళిపోయింది.

ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేయాలని అనుకుంటున్న సూడాన్ ను మొత్తానికి కుట్రపూరితంగా తుపాకుల పాలనలోకి తెచ్చేశారు. ఈ సాంప్రదాయం మంచిది కాదని ప్రపంచ స్థాయి సంస్థలు తెలుపుతున్నప్పటికీ చైనా లాంటి దేశాలు వీళ్ళను ఉద్రేకపరిచి ఇలాంటి పనులకు పూనుకునేట్టు చేస్తున్నాయి. ఇప్పటివరకు నియంత పాలన చేసిన ఒమర్ అల్ బషీర్ ను దించేసి, రెండేళ్ల తరువాత అదే ప్రభుత్వాన్ని సైనిక పరం చేయాలనే కుట్ర ద్వారా ఈ ఘటన సంభవించింది. దీనివెనుక చైనా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కారణం తమ దేశపౌరులు కూడా ఏదో ఒకరోజు విసుగుతో జిన్ ను పదవి నుండి దిగిపోవాలని విప్లవాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ఇంకా నియంత పాలన ప్రపంచంలో ఉండాలని కోరుకుంటూ, ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు జిన్. అంటే తన అధికార దాహం కోసం ఎన్ని దేశాలను, ఎంత మంది ప్రజలను ఏడిపిస్తున్నాడో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.  

తెల్లవారుజామునే ప్రధానిని, ఇతర అధికారులను ఖైదు చేసింది సైన్యం. ఇది తెలియగానే రాజధాని ఖర్భుమ్ విధులలోకి ప్రజలు వేలాదిగా వచ్చి ఆందోళనలకు దిగారు. వారిని చెదరగొట్టాలని సైనికులు బాష్పవాయువులను ప్రయోగించారు. పెద్దఎత్తున పొగ కమ్ముకోవడంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యం వైపు అందరు అడుగులు వేస్తుంటే, కొందరు కావాలని అధికార దాహంతో ఇంకా నియంతపాలన లోనే ఆగిపోవడం సరైనది కాదని వాళ్ళు నినాదాలు చేశారు.  నైలు నది దాటి పెద్దఎత్తున వస్తున్న ఆందోళన కారులను కొందరు వీడియో చిత్రీకరించి సామజిక మాధ్యమాలలో పెట్టారు. ఈ నిరసనలతో జరిగిన ఘర్షణలతో 12 మంది గాయపడ్డారు. రాజకీయ వర్గాల మధ్య ఘర్షణల కారణంగానే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని జనరల్ ప్రకటించారు. 2023లో ఎన్నికలు జరగవచ్చో లేదో అంతా జిన్ మహిమ..!

మరింత సమాచారం తెలుసుకోండి: