సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. తెలుగు ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఎంతో ఘనం గా జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఉద్యోగం వ్యాపారం నిమిత్తం ఇతర ప్రాంతాలకు  వెళ్లిన వారందరూ సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వచ్చి కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు. దీంతో ఇక గ్రామాల్లో పండుగ శోభను సంతరించుకుంటోంది. అయితే సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది సాంప్రదాయ వస్త్రధారణ లో తెలుగమ్మాయిలు. ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు.


 ఇక వీటితో పాటు సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది కోళ్ల పందాలు ఎద్దుల పందాలు. తెలంగాణలో ఇలాంటివి జరగవు. కానీ ఆంధ్రా లో మాత్రం పెద్ద ఎత్తున కోళ్ల పందాలు ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటివి నిర్వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించినప్పటికీ ఇక కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు నిర్వహించడం వెనుక ప్రజాప్రతినిధులు ఉండడంతో పోలీసులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే సాధారణంగా సంక్రాంతి పండక్కికోళ్ల పందాలు ఎడ్ల పందాలు జరగడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు మాత్రం ఇందుకు భిన్నం గా ఏకంగా పందుల పోటీలు కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కోళ్ల పందాలకు మారు పేరైన పశ్చిమ గోదావరి జిల్లా లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి గూడెం శివారు ప్రాంతం లో పందుల పోటీలు నిర్వహించారు. స్థానికం గా ఉండే గిరిజనుల అందరూ కూడా ఈ పందుల పోటీలు నిర్వహించగా ఈ సరికొత్త పోటీలను చూడటానికి చుట్టు పక్కల జనం మొత్తం పెద్ద ఎత్తున తరలి రావడం గమనార్హం.. ఇకపోతే ఇప్పటివరకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోళ్ల పందాలు ఎడ్ల పందాలు మాత్రమే జరుగుతాయని అనుకున్నవారూ ఇక ఇప్పుడు పందుల పోటీలు కూడా సంక్రాంతి సంబరాల్లో చేరి పోయాయి అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: