అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుంది అన్నది ఊహకందని  విధంగానే ఉంటుంది. కొంతమంది అదృష్టం వరించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ. సంపన్నులుగా  మారిపోవాలని ఇక పూజలు పునస్కారాలు చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసిన కొంతమందికి మాత్రం లక్ష్మీదేవి కటాక్షం లభించదు అని చెప్పాలి. మరి కొంతమంది ఏం చేయకపోయినా ఇక అదృష్టం తలుపు తడుతూ ఉంటుంది. ఒకవేళ మనకి దక్కాలని రాసిపెట్టి ఉంటే మనం ఏం చేయకపోయినా అది తప్పకుండా దొరుకుతుంది అని చెబుతూ ఉంటారు కదా.. కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఎంతోమంది సరదాగా కొనుగోలు చేసిన లాటరీ ఏకంగా అనుకోని విధంగా కోట్ల రూపాయలు తెచ్చి పెట్టడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి.


 ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది లాటరీల కారణంగా ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు గా మారిపోతున్నారు. అయితే ఇక్కడ నిరుపేద కుటుంబానికి లక్ష్మీదేవి కటాక్షం దక్కింది అని చెప్పాలి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఆ కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేది.  వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ వారి బ్రతుకు బండి ముందుకు సాగుతోంది.  ఓ దేవుడా ఎన్నాళ్ళు ఈ కష్టాలు.. మా కష్టాలు తీరేలా చూడవయా అంటూ ఆ కుటుంబం గట్టిగా దేవుడిని కోరుకున్నారో ఏమో అనుకొని విధంగా వారికి అదృష్టం వరించింది. ఎప్పటిలాగానే కట్టెలను తెచ్చేందుకు  అడవికి వెళ్ళగా అక్కడే డైమండ్  రూపంలో అదృష్టం వారి కోసం వేచి చూసింది.


 చివరికి ఒక వజ్రం దొరకడంతో ఆ కుటుంబం కష్టాలు తీరిపోయాయ్. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఓ గిరిజన మహిళను అదృష్టం వరించింది. అడవుల్లో కట్టెల కోసం వెళ్తుండగా ఆమెకు 20 లక్షల రూపాయల వజ్రం దొరికింది. పురుషోత్తం పూల్ కు చెందిన గొందా భాయి అనే మహిళకు ఇలా అదృష్టం వరించింది.  వజ్రాన్ని తీసుకొని భర్తతో కలిసి డైమండ్ కార్యాలయానికి వెళ్లగా సుమారు 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వ పన్నులు రాయుతి పోను తర్వాత మిగతా డబ్బుని  మహిళకు అందజేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: