జాతీయ కాంగ్రెస్ పార్టీని నాయకత్వ సంక్షోభమే కాకుండా ఆర్ధిక సంక్షోభం కూడ వెంటాడుతోంది. ఇటివల జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ తన పదవికి  రాజీనామ చేసిన విషయం తెల్సిందే .   రాహుల్ రాజీనామాతో ఆపార్టీ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది .  ఇక తాజాగా పార్టీని నడిపేందుకు ఆర్ధిక వనరులు కూడ లేక పార్టీ అనుబంధ సంఘాల నిధులకు చెక్‌‌ పెట్టడడం...  ఎన్నికల ముందు పని చేసిన పలువురు ఉద్యోగులను కూడ కోత విధించింది.


దేశంలో వరుసగా రెండవసారి అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ  అనుబంధ సంఘాలతోపాటు గౌరవ వేతనంపై పని చేసే పలువురు సేవాదళ్  కార్యకర్తలను కూడ ఆర్ధికంగా ఆదుకోలేని పరిస్థితి నెలకొంది . ఈ నేపథ్యంలోనే అనుబంధ సంఘాలకు ఇస్తున్న బెడ్జెట్‌లో కొత పెట్టడడంతోపాటు మహిళా, యువజన, ఎన్‌ఎస్‌యూఐ, రైతు సంఘాలకు ఇస్తున్న బడ్జెట్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  తగ్గించింది . ఇక ఆయా సంఘాల్లో పనిచేసే వారిలో అనేక మంది జీతాల్లో కూడ కోత విధించారు.

 

ఇక తాత్కలిక ప్రతిపాదికన నియమించుకున్న పలువురు ఉద్యోగులను కూడ తొలగించడంతో పాటు గత రెండు నెలలుగా వారికి జీతాలుకూడ చెల్లించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు ఉద్యోగులు కూడ వెళ్లిపోయినట్టు సమాచారం.మరోవైపు ఖర్చు తగ్గించుకోవడంతోపాటు ,అనవసర ప్రయాణాలు కూడ చేయవద్దని పార్టీ నేతలకు సూచించారు.మరోవైపు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో కూడ పనిచేస్తున్న వారికి సరైన సమయంలో జీతాలు లేని పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: