Image result for gayatri devi hd images


గాయత్రీ మంత్రంలో వర్ణన ధ్యానం ప్రార్ధన విలీనమై ఉంటాయి. ఒక మంత్రం బహుముఖ ప్రయోజనాలు. అవి దైహిక, మానసిక, ఆధ్యాత్మిక, అలౌకిక ప్రయోజనాలు మంత్రాన్ని నిర్దేసించిన విధానములో పటిస్తే అనియంత్రితంగానే సిద్ధిస్తాయి. అంటే ఈ మంత్రాన్ని సనాతన హిందూ సాంప్రదాయములో అలా నిర్మించారు. మంత్రములోని పద శబ్ధ అర్ధ నిర్దేశిత నిర్మాణమే ఈ గాయత్రి మంత్రానికి ఆ శక్తి ని నిబిడీకృతం అయ్యేలా చేసింది.

 

"ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం

భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”

 

గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.


  1. ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య

 

Image result for gayatri devi hd images


ప్రతిపదార్ధం :


ఓం     :     ప్రణవనాదం 

భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌

భూవః    :    భువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌

సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.

తత్‌     :    ఆ

సవితుర్‌     :    సమస్త జగత్తును

వరేణ్యం     :    వరింపదగిన

భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి

దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను

ధీమహి     :    ధ్యానించుచున్నాను

ధీయో      :  బుద్ది, జ్ఞానం

యోనః      :  ఏవైతే మన

ప్రచోదయాత్:  తెజోవంతం చేస్తాయో,  ప్రార్ధించుచున్నాను

కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి. 


Image result for gayatri devi hd images


సనాతనులైన ఋషులు మునులు గాయత్రీ మంత్రం పదాలను ఎంచుకొని మరియు వాటిని ఒక పద్దతిలో ఏర్పాటు చేసారు. ఈ మంత్రం జపించడం వలన ఒక మహిమాన్వితమైన శక్తిజనిస్తుంది లేదా వ్యాపిస్తుంది. గాయత్రీ మంత్రాన్ని సరైన పద్ధతిలో జపిస్తే మన అంతరాంతరాల్లో నవ్యానుభూతి లెదా శక్తితో దేహం ఉత్తేజితమై అలౌకిక  అనుభూతి కలుగుతుంది. గాయత్రీ మంత్రం జపించే సమయంలో ఎల్లప్పుడూ కళ్ళు మూసుకొని, మనసును భృకుటి మధ్యలో కేంద్రికరించటానికి ప్రయత్నం చేయాలి. ఇందులోని  ప్రతి పదం అలౌకిక (మేజికల్) ప్రభావాలు కలిగి ఉంటాయి. మనలో ఈ మంత్ర పఠనమే ఒక మానసిక, శారీరక, అలౌకిక ప్రకంపనలు కలిగించి తేజ్వంతం చేస్తాయి.


Image result for gayatri devi hd images


24 అక్షరాల గాయత్రీ మంత్రం పఠనం వలన ఆరోగ్యానికి 10 మంచి ప్రయోజనాలను అందిస్తుంది.


ఏకాగ్రత ద్వారా అభ్యాసాన్ని సాధన: "యోగ ఇంటర్నేషనల్ జర్నల్" లో ప్రచురించిన ఒక అధ్యయనంలో మంత్రాలు పఠించే వ్యక్తులలో మంచి ఏకాగ్రత మరియు జ్ఞాపక శ్స్క్తి  ఉందని కనుగొన్నారు. గాయత్రీ మంత్రం, పఠించిన ఫలితంగా ముఖం మరియు తలపై ఉండే మూడు చక్రాలను ప్రకంపనలతో ఉద్ధీపిత మౌతుంది, ప్రేరేపిస్తుంది. తద్వారా  కళ్ళు, ఎముక రంధ్రాలు, తల క్రింది భాగం పిట్యూటరీ గ్రంధి మరియు థైరాయిడ్ గ్రంధి మొదలైనవాటిలో స్పందననలు వలన ఏకాగ్రత మెరుగు పడుతుంది. ప్రకంపనల వలని వీటికి సంబందించిన గ్రందులు ఏకాగ్రతతో ఉద్దీపన చెంది వాటిలో ప్రేరణ ఏర్పడతాయి.


Image result for gayatri mantra benefits hd images


శ్వాస మెరుగుపడుతుంది: క్రమం తప్పకుండా ఈ మంత్ర పఠనం నియంత్రిత శ్వాస ద్వారా ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుంది. శ్వాస క్రమపద్ధతిలొస్ తీసుకోవటం వలన మొత్తం శరీరానికి ప్రాణ వాయువు అంది ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.


గుండె పనితనాన్ని మెరుగు పరుస్తుంది: "బ్రిటిష్ మెడికల్ జర్నల్" లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మంత్రం జపించడం వలన ఒక వ్యక్తి యొక్క శ్వాస వేగాన్ని  తగ్గిస్తుంది. హృదయ స్పందనలు క్రమబద్ధీకరించవడి ఆరోగ్యం పెంపొందుతుంది. సున్నితత్వంతో పాటు గుండె యొక్క "బీటింగ్" అంటే హృదయ స్పందన తీరును (రక్తపోటు పరిశీలన ) "ప్రత్యేక పారామీటర్ల" లో గుండె వ్యాధులు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.



Image result for gayatri mantra benefits hd images


నాడీమండలం పనితీరును మెరుగుపరుస్తుంది: ఈ మంత్రం నాలుక, పెదవులు, స్వర తంత్రి, అంగిలి మొదలైన వాటిపై ఒత్తిడి తెచ్చి మెదడు చుట్టూ ఉన్న నాడీ కేంద్రాలను బలోపేతం చేయటం మరియు నరముల పనితీరులో నూతన ఉద్దీపనలకు, ప్రకంపనలకు నాంది పలుకుతుంది. అంతేకాక న్యూరోట్రాన్స్మిటర్లను సరైన రీతిలో  ప్రేరణ పొందటానికి సహాయపడుతుంది.


ఒత్తిడి కారణంగా కలిగే నష్టాన్ని నివారించి "హార్ట్ - బీట్ తరుగుదల" కు సహాయపడుతుంది: ఈ మంత్రం జపించడం మానసిక ఒత్తిడి తగ్గి దేహం మనసు తేల్క పడుతుంది. శరీరం బలమైన రోగనిరోధక  తత్వాన్ని పెంచుకొని ప్రతిస్పందించటం జరుగుతుంది. మనసుపై ఒత్తిడి వలన జరిగే నష్టానికి ప్రతిగస్ స్పందనలను సృష్టిస్తుంది. గాయత్రీ మంత్రం ప్రతిరోజు పారాయణం చేయటం వలన ఒత్తిడి తగ్గి ఆరోగ్యం సుస్థిర మౌతుంది.

 

మనస్సుకు శక్తి గ్రందులకు ఉత్తేజం: ఈ మంత్రం జపించడం నాడి పనితీరు మారి నిరాశ, నిస్తేజం తొలగటం మాత్రమే కాకుండా మూర్ఛ మొదలైన వ్యాదుల చికిత్సలో సహాయపడుతుంది. ఎండార్ఫిన్లు మరియు ఇతర రిలాక్సింగ్ హార్మోన్లు విడుదలై ఉత్తేజం చెందుతాయి.


Image result for gayatri mantra benefits hd images


చర్మం తేజోవంతమై నూతనత్వాన్ని సంతరించుకుంటుంది: మంత్రం వారా మెరుగైన ప్రకంపన వలన ముఖం నాడులు కీలక ప్రాంతాల్లో ఉద్దీపన చెంది రక్త ప్రసరణ క్రమబద్ధీకరించబడి చర్మం నుండి విషాన్ని వదిలించుకోని యవ్వనకాతులతో ప్రకాశవంతమౌతుంది. లోతైన శ్వాస వలన ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి చర్మం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది.


Image result for gayatri mantra benefits hd images


ఉబ్బస ఉపశమనానికి సహాయపడుతుంది: ఊపిరితిత్తులు బలోపేతం కావటం వలన ఉబ్బస వ్యది నివారణ జరుగుతుంది కనీసం చికిత్స ద్వారా మెరుగౌతుంది.


మనస్సు ప్రశాంతత పొందుతుంది: ఓంతో మొదలయ్యే ఈ మంత్ర ఈ ధ్వని లోని రిథం మరియు ఉచ్చారణ గొంతు, కపాలం, పెదవులు, నాలుక, అంగిలి ద్వారా ప్రకంపనాలను నింపుతుంది. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రిలాక్సింగ్ హార్మోన్ల విడుదలతో గాయత్రీ మంత్ర అక్షరాలు అంతర్లీనంగా మనస్సు ప్రశాంతంగా ఉంచటానికి సహాయ కారిగా ఉంటుంది.

 

Image result for gayatri devi hd images


ఇంగ్లిష్ లో గాయత్రీ మంత్రార్ధం


Gayatri mantra, the most ancient and potent mantra of Hinduism, helps the higher human to be born in us all. Just like the Sun liquidates darkness, Gayatri Mantra decimates ignorance. It illumines the intelelct and produces the highest bliss, creativity and success in the owrld. The recitation of each of these Gayatri Mantras gives different benefits and brings different rewards. To attain these rewards, one must recite the particular mantra every day 54 times or 108 times with devotion and one pointed mind.

 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: