ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లోని తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిన కారణంగా మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్ జట్టులో ఓపెనర్లు పృథ్వీషా 48 పరుగులు, శిఖర్ ధావన్ 43 పరుగులతో రాణించడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేయగలిగింది. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో వచ్చిన బెంగళూరు జట్టుకు మోదాహతి ఓవర్ లోనే షాక్ ఇచ్చారు ఢిల్లీ బౌలర్లు. తన మొదటి బంతికే ఓపెనర్ దేవదత్ పాడిక్కల్ పెవిలియన్ చేరుకోగా ఆ తర్వాత ముసో ఓవర్లు మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 8 బంతుల్లో నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో బెంగళూరు జట్టు ఆరు పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అలాగే ఎబి డివిలియర్స్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ క్రమంలోనే ఏబీ డివిలియర్స్ 26 బంతుల్లో 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. కానీ శ్రీకర్ భారత్ మాత్రం ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. డివిలియర్స్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ కూడా అద్భుతంగా రాణించాడు. అయితే మాక్స్వెల్ 33 బంతుల్లో 51 పరుగులు చేసి ఐపీఎల్ 2021 లో ఆరవ అర్ధ శతకాన్ని సాధించాడు. అలాగే శ్రీకర్ భరత్ 52 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అయితే బెంగళూరు జట్టుకు చివరి బంతికి విజయం కోసం ఐదు పరుగులు కావాల్సి ఉండగా శ్రీకర్ భరత్ సిక్స్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఈ ఏడాది ఐపీఎల్ లో 9వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021లో ఐదవ పరాజయాన్ని చవిచూసింది. అయినా ఇప్పటికి పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో ఢిల్లీని మొదటి స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: