2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి బిసిసిఐ ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో మినీ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీ  లకు కొన్ని ఆదేశాలను కూడా జారీ చేసింది బీసీసీఐ. ఇక ఆయా జట్లు యాజమాన్యాలు తమతో అంటిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలతో పాటు ఇక మినీ వేలంలోకి వదిలేసే ప్లేయర్స్ డీటెయిల్స్ కూడా అందించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఇక ఈ వివరాలను బీసీసీఐ చేతికి ఇచ్చేసాయి.


 ఈ క్రమంలోనే ఇక ఎన్నో జట్ల యాజమాన్యాలు ఇక తమ జట్టులోకి కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్లను సైతం వదులుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారిని సైతం ఆయా ఫ్రాంచైజీలు వదులుకుంటూ ఉండటం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్  జట్టు యాజమాన్యం. ఏకంగా 10.75 కోట్లు పెట్టి ఎంతో పోటీపడి మరి కొనుగోలు చేసిన ఆటగాడిని ఇప్పుడు వదులుకునేందుకు సిద్ధమైంది.


 ఆ ఆటగాడు ఎవరో కాదు శార్దూల్  ఠాగూర్ కావడం గమనార్హం. గత ఏడాది జరిగిన మెగా వేలంలో ఏకంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శార్దూల్  ఠాగూర్ ని వేలంలో మిగతా జట్లతో పోటీపడి మరి 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతడు రికార్డు ధర పలికాడు అంటూ అతని గురించి అందరూ చర్చించుకున్నారు. అయితే అతడు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్ లలో కేవలం 15 వికెట్లు మాత్రమే తీసాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతన్ని ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు అమ్మేసింది అని చెప్పాలి. గుజరాత్ నుంచి పెర్గ్యూసన్, గుర్భాజ్ లను కూడా కొనుగోలు చేసింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL