మహా భారతం అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క దుర్మార్గపు రాజు దుర్యోదన రాజు.ఆయన చేసిన కర్మలకు చివర్లో ఆయనకు ఏ గతి పట్టించారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఇంట్లో ఈ మహా భారతం గురుంచి చెప్పుకుంటూనే ఉన్నారు.అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది.ఎంతో దుర్మార్గుడు అనే పేరు తెచ్చుకున్న దుర్యోధనున్ని కూడా బాగా పూజించే దేవాలయం ఒకటుంది అవును నిజం వివరాల్లోకి వెళ్తే.దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న ఏకైక దుర్యోధన ఆలయం ఒకటుంది అధర్మపరుడైన దుర్యోధనుడికి ఇక్కడ ప్రజలు 3 దేవుళ్లతో సమానంగా చాలా భక్తితో పూజలు నిర్వహించడం గొప్ప విశేషం.


కేరళ రాష్ట్రంలో కొల్లాం జిల్లాలో పోరువలి అనే చిన్న గ్రామంలో మలనాడపై ఈ ఆలయం ఉంది. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండకు ఆ పేరు పెట్టుకున్నారు. ఈ కొండకు పెరువిరితి మలనాడ అనే పేరు కూడా ఉంది. మహాభారతం సమయంలో జూదంలో ఓడిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసానికి, ఒక ఏడాది అజ్ఞాత వాసానికి వెళ్తారు. పాండవులు తమ అరణ్య వాసం పూర్తి చేసుకుని అజ్ఞాత వాసంలో ఉన్న సమయంలో వారిని పట్టుకునేందుకు దుర్యోధనుడు, శకుని వేసిన పథకాలు అన్ని ఇన్ని కాదు.అజ్ఞాత వాసంలో ఉన్న పాండవులను పట్టుకుంటే వారు మరో 12 ఏళ్లు అజ్ఞాత వాసం చెయ్యాలి.ఆ రూల్ ని పాస్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ చివరికి కనుక్కోలేక పోయాడు.


 దుర్యోధనుడే స్వయంగా వారిని వెతుక్కుంటూ బయలు దేరే సమయంలో. చాలా దూరం ప్రయాణించి కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్న దుర్యోధనుడు అక్కడ దప్పికతో నీరసించి విశ్రమించి ఉండి పోయాడు. ఆ సమయంలో దుర్యోధనుడి పరిస్థితి గమనించిన కురువ జాతికి చెందిన ఓ మహిళ తన వద్ద ఉన్న కొబ్బరి కల్లును అతడిని ఇస్తుంది. ఆ కల్లు రుచి చూసిన దుర్యోధనుడు వెంటనే దప్పిక నుంచి ఉపశమనం పొంది తిరిగి మునుపటి వలే తయారవుతాడు. దాంతో ఆమె చేసిన సహాయానికి ప్రతీకగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చేసి మలనాడ కొండపై కూర్చుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహా శివున్ని పూజించేవాడు. ఆ విశ్వాసంతో కురువ జాతికి చెందిన పూర్వీకులు మలనాడ కొండపై దుర్యోధనుడికి ఆలయం నిర్మించినట్లు అక్కడి ప్రజలు చెప్పుకొస్తున్నారు.


దేశంలో ఎక్కడ లేని విధంగా దుర్యోధనుడికి ఆలయం నిర్మించడమే కాకుండా  ప్రత్యేక పూజలు,ఉత్సవాలు చెయ్యడం కూడా ఒక విశేషం. దీనికి తోడు మరో ప్రత్యేకత కూడా అందరినీ ఆకర్షిస్తుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో దేవుడికి అనేక ఆహార పదార్ధాలతో నైవేద్యం సమర్పిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దుర్యోధనుడికి మద్యాన్ని నైవేద్యంగా పెట్టి పూజించడం ఒక  విశేషం. దుర్యోధనుడు ఇక్కడి కల్లు రుచికి ఆకర్షితుడైన కారణంగా మద్యాన్నే నైవేద్యంగా పెట్టి పూజ చెయ్యడం ఆచారం గా వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: